కన్నమ్మ కన్నమ్మ నేనే నువ్వా..
ఏనాడో నాకోసం పుట్టేసావా
అందం గురి పెట్టేసావే… నన్నే పడగొట్టేసావే
కళ్ళల్లో కళ్ళల్లో ప్రేమే నువ్వా..
ప్రాణంలో ప్రాణంగా ప్రేమిస్తావా
నాకే నువ్వు నచ్చేసావే.. నీకే మానసిచ్చేశాలే
ఎదురుగా నువ్వే ఉంటే నే గురుతే రానే
నిన్నే చూడకపోతే దిగులైపోతానే
ఎవరు లేని ఎదలో నిలిపావే పాదం
ఎటుకో తరిమేసావే ఏకాంతం మొత్తం..
చినుకు చినుకుగా… మనసుపైన చనువు కురిసే వర్షంలా..
పెదవికెదురుగా… పెదవి పడిన నరకముందే స్వర్గంలా..
కడలి ఇసుకలో… నీ ఒడిలో నేను తలను వాల్చి నిద్దరోతా..
అలల వేళ్ళతో… నా తలని నువ్వు నిమురుతుంటే బతుకంతా..
ప్రేమలో పడనిదెవ్వరు ప్రాయమే ఉప్పొంగితే
యవ్వనం నిలువనివ్వదు ప్రేమకే పొలమారితే
మొహమాటమంతా సెలవంటూ పలికి వెళ్లిపోయే దూరమే
ప్రేమలో పడనిదెవ్వరు ప్రాయమే ఉప్పొంగితే
బరువే పెరిగినదే నిన్ను మోసే నా హృదయం
నిదురే మరిచినదే నీ జతలో నా నయనం
గడపాలనుంది నీతో ఇంకా వెళ్ళిపోతావేంటి ఉండొచ్చుగా
వెళ్ళిపోవాలంటూ చెబితే వంక వదిలేస్తావేంటి ఆపొచ్చుగా
చినుకు చినుకుగా… మనసుపైన చనువు కురిసే వర్షంలా..
పెదవికెదురుగా… పెదవి పడిన నరకముందే స్వర్గంలా..
కడలి ఇసుకలో… నీ ఒడిలో నేను తలను వాల్చి నిద్దరోతా..
అలల వేళ్ళతో… నా తలని నువ్వు నిమురుతుంటే బతుకంతా..
కన్నమ్మ కన్నమ్మ నేనే నువ్వా..
ఏనాడో నాకోసం పుట్టేసావా
అందం గురి పెట్టేసావే… నన్నే పడగొట్టేసావే
కళ్ళల్లో కళ్ళల్లో ప్రేమే నువ్వా
ప్రాణంలో ప్రాణంగా ప్రేమిస్తావా
సంగీతం : విజయ్ బుల్గానిన్
సాహిత్యం : సనారే
గాయకులు : ఆదిత్య ఆర్.కె, లక్ష్మీ మేఘన