దూకే నాపై…ఇలా…
ఇవాళే.. ప్రేమ.. వెల్లువ
పగలే నా వైపుకి నడిచే కలవా
పడుతూ ఎగిరే అలవా
మనసే నిను చూడని ఒక్కటే గొడవ
కనులే ఇప్పుడే చదివా
వెంట వచ్చావే… వెంబడించావే
ఊపిరల్లే మారావే నేడే నీవే
నమ్మి తీరాలే.. కల కాదే
పేరుకే నేనున్నాలే ప్రాణం నీదే..
ఎవరెవరని వెతికినా..
కనులకి తను దొరికెనా..
మరిచానిక దేనినైనా…
నీ వలన…
తెలుసా తొలిసారిగా మనసే గెలిచా
ఎప్పుడు ఎదుటే నిలిచా
కోపం మరిచానుగ ఇది నీ మహిమ
నిజమే నువ్వు నా సగమా…
ప్రేమ వెల్లువ.. ప్రేమ ఉప్పెన.. ప్రేమ సందడి…
ప్రేమ వెల్లువ.. ప్రేమ ఉప్పెన.. ప్రేమ సందడి…
అటో ఇటో ఎటైనా
అడుగే జరిగే మెలమెల్లగా
మరింత ఒకటొకటిగా చేరెనా
మనలో మనమే కలిసే విధమా
గీతగీసాలే… వేచిచూశాలే…
నిన్ను మించి నాకింకా తోడంటూ దొరుకునా
ఆపలేనులే… చూపలేనులే.. చెప్పలేనులే
దాచలేను నేనింకా నాలో ప్రేమా….
ఎవరెవరని వెతికినా
కనులకి తను దొరికెనా..
మరిచానిక దేనినైనా…
నీ వలన…
ప్రేమ వెల్లువ.. ప్రేమ ఉప్పెన.. ప్రేమ సందడి…
ప్రేమ వెల్లువ.. ప్రేమ ఉప్పెన.. ప్రేమ సందడి…
సాహిత్యం: కృష్ణకాంత్
గాయకులు : సిద్ శ్రీరామ్, నూతన మోహన్
సంగీతం : మిక్కి జే మేయర్