కన్నుల్లోన ఉన్నాయి చూడు
రంగుల్లు ఏడు నీవల్లే
కన్నీళ్లతో నీ బొమ్మ గీసి
నీకై ఎదురే చూసాలే
ఇంకా ఎన్నాళ్లని… అడిగెనే
వెళ్లపోతానని.. అలిగెనే
గుండె ఇన్నాళ్లుగా… అలిసెనే
ఇప్పుడల్లాడెనే…!!
నిన్ను చూడాలనీ.. ప్రాణం వేచెలే
కాలం ఆగనీ.. ఇంక నేనాగనే
ఒడిలో పడతా, ఒడిలో పుడతా
ఎగిసే అలనై నే నీలో…
నీలిమబ్బు నువ్వైతే
చిన్ని గువ్వనైతి…
అందుకోను ఎగిరానే కష్టమెంచనైతి
నేనంటేనే నువ్వని
నాలో మొత్తం నీవనీ
ఏమంటారే ప్రేమని
కలిపి నువ్వు నేననీ
చుక్కా నువ్వే… నా చుక్కానివే
నా రెక్కల్లో చిక్కుల్లో నువ్వే
నా ఎండా నువ్వే… నా నిండా నువ్వే
నేనుండేటి గూడు నువ్వే
నువ్వు నేను చిందే చినుకులం
తొలకరులే కురియా…
కన్నుల్లోన ఉన్నాయి చూడు
రంగుల్లు ఏడు నీవల్లే
కన్నీళ్లతో నీ బొమ్మ గీసి
నీకై ఎదురే చూసాలే
ఇంకా ఎన్నాళ్లని… అడిగెనే
వెళ్లిపోతానని… అలిగెనే
గుండె ఇన్నాళ్లుగా… అలిసెనే
ఇప్పుడల్లడెనే…రు రురూ
దూరం కాదు … మధ్యన్న దారం చూడు
గాయం కాదు… సాయానికి దారే చూడు
నిన్నటి గురుతే నను గుచ్చే
నిమిషమో యుద్ధం జరిపించే
ముద్దులా రూపం గురుతొచ్చే
బతకగా ఆశనిచ్చే
చుక్కా నువ్వే… నా చుక్కానివే
నా రెక్కల్లో చిక్కుల్లో నువ్వే
నా ఎండా నువ్వే…నా నిండా నువ్వే
నేనుండేటి గూడు నువ్వే
నువ్వు నేను చిందే చినుకులం
తొలకరులే కురియా…
కన్నుల్లోన ఉన్నాయి చూడు
రంగుల్లు ఏడు నీవల్లే
కన్నీళ్లతో నీ బొమ్మ గీసి
నీకై ఎదురే చూసాలే
ఇంకా ఎన్నాళ్లని… అడిగెనే
వెళ్లిపోతానని… అలిగెనే
గుండె ఇన్నాళ్లుగా… అలిసెనే
ఇప్పుడల్లడెనే…
ఇంకా ఎన్నాళ్లనీ
వెళ్లిపోతాననీ
గుండె ఇన్నాళ్లుగా
ఇప్పుడల్లాడెనే
ఇప్పుడల్లాడెనే ఇప్పుడల్లాడెనే ఇప్పుడల్లాడెనే
నేనల్లాడనే నేనల్లాడనే నేనల్లాడనే…
సంగీతం : సంతోష్ నారాయణన్
గాయకుడు : కపిల్ కపిలన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్