8 వ‌సంతాలు

అంద‌మా అంద‌మా…
నువ్వు నా సొంత‌మా…
స్నేహ‌మా మోహ‌మా…
తేల్చావా ప్రాణ‌మా…

నీ ప‌రిచ‌యం… ఓ చిత్ర‌మా..
నీ ద‌ర్శ‌నం… ఓ చైత్ర‌మా
నీ స‌న్నిదే సౌఖ్య‌మా…
నాతో అడుగులు వేస్తావా ఓ ప్రేమా..
నీ జ‌త లేక నిల‌వ‌డమిక‌ నా త‌ర‌మా…

అంద‌మా అంద‌మా…
నువ్వు నా సొంత‌మా…
స్నేహ‌మా మోహ‌మా…
తేల్చావా ప్రాణ‌మా…

ఏ న‌డి రేయి నీ ఊహ‌ల్లో.. నే క‌నుతెరిచిన‌
నీ చిరున‌వ్వులో ఉద‌యాలు
నా ద‌రిచేరేనా
నా జాముల్లో
నీ స్వ‌ప్నాలు ఆ హ‌రివిల్లులా
ఈ గుండెల్లో నీ వ‌ర్ణాల రూపం నింపేనా

మ‌న‌సు త‌లుపు తెరిచి ఎదురు చూసా
క‌ల‌ల బ‌రువు క‌నుల వెనుక మోసా
ఒక‌రికొక‌రు బ‌య‌ట ప‌డ‌ని వేళ‌
ఎవ‌రు తెలుప‌గ‌ల‌రు క‌డ‌కు వ‌ల‌పునిలా…
ఆర‌దీ జ్వాలా..

వెన్నెల…. వెన్నెల…
కురిసేనా క‌న్నులా…
మంచులా… మాయాలా…
క‌మ్మేనా ఈ క‌ల‌…..
నీ ప‌లుకులే… సంగీత‌మా…
నీ రాక వాసంత‌మా…
నీతో అడుగులు వేస్తుందా ఈ ప్రేమ‌…
నీ జ‌త‌లో గ‌డిపే ఈ క్ష‌ణ‌మే నిజమా…

అంద‌మా అంద‌మా…
నువ్వు నా సొంత‌మా…
స్నేహ‌మా మోహ‌మా…
తేల్చావా ప్రాణ‌మా…

ర‌చ‌యితః వ‌న‌మాలి
పాడిన‌వారుః హేష‌మ్ అబ్దుల్ వ‌హాబ్‌, అవ‌ని మ‌ల్హ‌ర్‌
మ్యూజిక్ డైరెక్ట‌ర్ః హేష‌మ్ అబ్దుల్ వ‌హాబ్‌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress