నీ నగుమోమే కనులారా
చూస్తుంటే క్షణమైనా
కనురెప్ప వాలేనా..
నా కనుసైగ నీ వెనక
వెంటాడి మౌనంగా
వేచింది నువు రాక…
ఊహలలో ఊరిస్తూ దాగినది చాలుగా
ఊరటగా నా ఎదురూ నా జతగా రారాదా..
చెలియా చెలియా నిన్ను చూడంగా
చెలియా చెలియా కనులు చాలవుగా..
తొలిసంధ్యల వర్ణం తెచ్చి
నీ పాపిట బొట్టుగ పెట్టి
నీ ఎదపై వాలే కలనే చూడనా..
మలిసంధ్యల ఎరుపే తెచ్చి
మా రాణికి పారాణద్ది
ఆ పాదం నా ఎద పైనే మోయనా..
చేతిలో గీతలా ఉండనా తోడుగా..
నా పేరుకి ఎడమ వైపు నువ్వు చేరంగా..
కౌగిలి లో నీ ఎదపై నా బరువే తెలిసెనే
నీ కురులే నా ముఖమే దాచేసెనే..
పెదవి ఎరుపు తగిలే మెరుపు మునుపు ఎపుడూ తెలియదే..
కడలి ఎదపై నడక నేర్చే అలను నేనేలే..
నీ చేతులు నవ్వేటట్టు ఆ గాజుల చప్పుడు చేస్తూ
నీ వేళ్ళను నా తలపైన నడపగా..
ఓ నిమిషం మారాం చేస్తూ మరు నిమిషం ముద్దే చేస్తూ
కౌగిట్లో పసివాడల్లే మారనా..
చెలియా చెలియా పయనమే నేనా
చెలియా చెలియా గమ్యమే నువ్వా..
సాహిత్యం : కిట్టు విస్సాప్రగడ
గాయకుడు: రేవంత్
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్