ఒక గుడ్డు లేకుండా గుట‌కాయ‌స్వాహా చేసే ఎగ్‌ మ‌సాలా గ్రేవీ క‌ర్రీ!

కావాల్సిన ప‌దార్థాలు :
కోడిగుడ్లు : 6
ఉల్లిపాయ‌లు : 2 (పెద్ద‌వి)
ట‌మాటాలు :2
పెరుగు : 2 టీస్పూన్స్
అల్లం, వెల్లులి పేస్ట్ :1 టీ స్పూన్
కారం : ఒక టీస్పూన్
ప‌సుపు: పావు టీస్పూన్
ధ‌నియాల పొడి : ఒక‌ టీస్పూన్
జీల‌క‌ర్ర పొడి : ఒక‌ టీస్పూన్
గ‌రం మ‌సాలా : ఒక‌ టీస్పూన్
ల‌వంగాలు : 5
యాల‌కులు : 3
దాల్చిన చెక్క: ఇంచు ముక్క‌
ప‌చ్చిమిర్చి: 2
కొత్తిమీర : 1 క‌ట్ట‌
క‌రివేపాకు : 2 రెమ్మ‌లు
నూనె, ఉప్పుః త‌గినంత‌

త‌యారీ విధానం :
స్టెప్1:
ముందుగా కోడిగుడ్లు ఉడ‌క‌బెట్టి పొట్టు తీసి పెట్టుకోవాలి. ఉల్లిగ‌డ్డ‌లు , ట‌మాటాలు క‌ట్ చేసి పెట్టుకోవాలి.

స్టెప్ 2: స్ట‌వ్ పై ఒక క‌డాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉడికించుకున్న కోడిగుడ్ల‌కి గాట్లు పెట్టుకొని లైట్ గోల్డ్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించుకొని ప‌క్క‌న పెట్టాలి.

స్టెప్ 3: అదే క‌డాయిలో క‌ట్ చేసుకున్న ఉల్లిపాయలు గోల్డ్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించుకోవాలి. అందులో ట‌మాటాలు వేసి ట‌మాటాల‌ను మ‌గ్గ‌నివ్వాలి. దీన్ని చ‌ల్లారాక మిక్సీ ప‌ట్టుకోవాలి. ఆ త‌ర్వాత ప‌క్క‌న ఒక గిన్నెలో పెరుగులో.. ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి, గరం మ‌సాలా, ఉప్పు వేసి క‌లిపి పెట్టుకోవాలి.

స్టెప్ 4: ఇంకో క‌డాయి పెట్టుకొని నూనె వేసుకొని ల‌వంగాలు , యాల‌కులు, దాల్చిన చెక్క‌, క‌రివేపాకు ,ప‌చ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించుకోవాలి.

స్టెప్ 5: ఇప్పుడు పెరుగులో క‌లిపి పెట్టుకున్న మిశ్ర‌మం వేసుకొని క‌లుపుతుండాలి. రెండు నిమిషాల త‌ర్వాత మిక్సీ ప‌ట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని క‌లుపుకోవాలి.

స్టెప్ 6: స‌న్న‌ని మంట మీద ఐదు నిమిషాల త‌ర్వాత వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు వేసి మూత పెట్టేయాలి. ఇవి ఉడికాక చివ‌ర‌గా కొత్తిమీర వేసి దించేసుకోవాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress