వినాయ‌క చ‌వితి స్పెష‌ల్.. బెల్లం పాల తాలిక‌లు నైవేద్యంగా స‌మ‌ర్పించండి!

కావాల్సిన ప‌దార్థాలు :
పాలు : మూడు క‌ప్పులు
బియ్యం పిండి: ఒక‌ క‌ప్పు
బెల్లం తురుము: ఒక క‌ప్పు
నెయ్యి: రెండు టీ స్సూన్లు
స‌గ్గు బియ్యం: రెండు టీ స్సూన్లు
జీడిప‌ప్పులు, కిస్మిస్: ఒక గుప్పెడు
యాల‌కులు: నాలుగు

త‌యారీ విధానం:
స్టెప్ 1:
ముందుగా పాలు మ‌రిగించి ప‌క్క‌న పెట్టుకోవాలి. అర‌గంట పాటు స‌గ్గు మియ్యం నాన‌బెట్టుకోవాలి.
స్టెప్2: స్టౌ పై ఒక గిన్నె పెట్టుకొని నెయ్యి వేసి జీడి ప‌ప్పు, కిస్మిస్ వేయించి పెట్టుకోవాలి. అదే గిన్నెలో ఒక టీ గ్లాసు నీళ్లు, మూడు స్పూన్ల బెల్లం వేసి నీళ్లు మ‌రిగిన త‌ర్వాత స్టౌ ఆఫ్ చేసి బియ్యం పిండి వేసి క‌లుపుకోవాలి.ఈ మిశ్ర‌మంను ఉండ‌లు లేకుండా చ‌పాతీ పిండిలా క‌లిపి పక్క‌న పెట్టుకోవాలి.
స్టెప్3: స్టౌ పై మ‌రో గిన్నె పెట్టుకొని బెల్లం తురుము టీ గ్లాసున్న‌ర నీళ్లు పొసి బెల్లం క‌రిగించి పెట్టుకోవాలి.
స్టెప్4: బియ్యం పిండి మిశ్ర‌మం నుండి కొద్ది కొద్దిగా పిండి తీసుకొని తాలిక‌లు కొన్ని చిన్న ఉండ్రాళ్లు చేసి ప‌క్క‌న పెట్టుకోవాలి.
స్టెప్5: ఇప్పుడు స్టౌ పై పాలు పెట్టుకొని నానబెట్టుకున్న స‌గ్గుబియ్యం వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ త‌ర్వాత ముందుగా చేసి పెట్టుకున్న తాలిక‌లు, ఉండ్రాళ్లు వేసి స‌న్న‌ని మంట పై ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి.
స్టెప్6: క‌రిగించి పెట్టుకున్న బెల్లం సిర‌ప్, ఒక స్పూన్ బియ్యం పిండిలో కొన్నినీళ్లు పోసి క‌లుపుకొని ఈ మిశ్ర‌మంను కూడా వేసి క‌లుపుకోవాలి. తాలిక‌లు, ఉండ్రాళ్లు ఉడికిన త‌ర్వాత వేయించి పెట్టుకున్న జీడి ప‌ప్పు, కిస్మిస్ వేసి క‌లుపుకొని స్టౌ ఆఫ్ చేసుకోవాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress