పాల‌క్క‌డ్ వెంగాయ సాంబార్.. రుచి వేరే లెవ‌ల్‌!

కావాల్సిన ప‌దార్థాలు :
చిన్న ఉల్లిపాయ‌లు : అర కేజీ
కందిప‌ప్పు : ఒక క‌ప్పు
చింత‌పండు : నిమ్మ‌కాయ సైజంత‌
బెల్లం : ఒక టీస్పూన్
ఆవాలు : 3/4 స్పూన్
జీల‌క‌ర్ర : 3/4 స్పూన్
ప‌సుపు : పావు టీస్పూన్‌
కొత్తిమీర : చిన్న క‌ట్ట
కొబ్బ‌రితురుము : 4 టీస్పూన్స్
ధ‌నియాలు : ఒక టీస్పూన్
మెంతులు : పావు టీస్పూన్
శ‌న‌గ‌ప‌ప్పు : అర టీస్పూన్
ఎండుమిర్చి : 2
ఉప్పు, నూనె: త‌గినంత‌

త‌యారీ విధానం :
స్టెప్ 1:
క‌డాయిలో కొద్దిగా నూనె వేసి వేడ‌య్యాక‌.. ధ‌నియాలు, మెంతులు, శ‌న‌గ‌ప‌ప్పు, ఎండుమిర్చి వేసి వేయించాలి. స్టౌ ఆపేసే ముందు కొబ్బ‌రితురుము వేసి క‌లిపి కాస్త చ‌ల్లార‌నివ్వాలి.
స్టెప్ 2 : ఈ మిశ్ర‌మాన్ని కొద్దిగా నీళ్లు వేసి మెత్త‌గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. చింత‌పండులో కొన్ని వేడి నీళ్లు పోసి నాన‌బెట్టాలి. ఆ త‌ర్వాత ఆ చింత‌పండు నీళ్లు పోసి ర‌సం తీసి ప‌క్క‌న పెట్టుకోవాలి.
స్టెప్ 3 : కందిప‌ప్పులో నీళ్లు పోసి ఉడికించాలి. చిన్న ఉల్లిపాయ‌ల‌ను పొట్టు తీసి, వాటిని కుదిరితే రెండు ముక్క‌లుగా క‌ట్ చేసి క‌డిగి పెట్టుకోవాలి.
స్టెప్ 4 : క‌డాయిలో కొద్దిగా నూనె పోసి ఉల్లిపాయ ముక్క‌ల‌ను ప‌చ్చివాస‌న పోయేవ‌ర‌కు వేయించాలి. అవి వేగాక చింత‌పండు ర‌సం, ప‌సుపు, ఉప్పు వేసి మ‌రిగించాలి.
స్టెప్ 5 : కొద్దిగా చిక్క‌బ‌డ్డాక బెల్లం, కొద్దిగా నీళ్లు పోసి మ‌ళ్లీ మ‌రిగించాలి. ఇందులోనే ప‌ప్పు, కొబ్బ‌రి తురుము పేస్ట్ వేసి మ‌రింత సేపు చిక్క‌బ‌డేంత వ‌ర‌కు మ‌రగ‌నివ్వాలి. ఆ త‌ర్వాత స్టౌ ఆపేయాలి.
స్టెప్ 6: ఇప్పుడు చిన్న క‌డాయిలో నూనె వేసి ఆవాలు, జీల‌క‌ర్ర‌, మెంతులు వేయించి ఆ సాంబారులో వేయాలి. చివ‌ర‌గా కొత్తిమీర వేసి క‌లుపాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress