కావాల్సిన పదార్థాలు :
కొబ్బరి కాయ : ఒకటి
బెల్లం: ఒక కప్పు
నెయ్యి: రెండు టీ స్పూన్స్
జీడిపప్పులు : గుప్పెడు
తయారీ విధానం:
స్టెప్1: కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకొవాలి. బెల్లం కూడా మెత్తగా చేసి పెట్టుకోవాలి.
స్టెప్2: స్టౌ పై ఒక మందపాటి గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పులను వేయించుకోవాలి. వీటిని పక్కన పెట్టి మిక్సీ పట్టుకున్న కొబ్బరి వేసి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి.
స్టెప్ 3 : ఇందులో బెల్లం వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు సన్నని మంట పై బెల్లం మొత్తం కరిగి కొబ్బరి మిశ్రమం ఉండలు చుట్టుకోవడానికి వచ్చేలా అయ్యే వరకు ఉంచుకొని స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
స్టెప్ 4 : ఇప్పుడు కొబ్బరి మిశ్రమం కాస్త చల్లారాక చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని లడ్డులు చుట్టుకోవాలి. వీటిపై జీడిపప్పులను అతికించేయండి అంతే కొబ్బరి లడ్డు టేస్టీగా మీ ముందుంటుంది.