శ్రావ‌ణ మాసం స్పెష‌ల్ టెంపుల్ స్టైల్ క‌దంబం రైస్!

కావాల్సిన పదార్థాలు :
బియ్యం : ఒక క‌ప్పు
కంది ప‌ప్పు : ఒక క‌ప్పు
చింత పండు : నిమ్మ‌కాయంతా
ఆలుగ‌డ్డ : ఒక‌టి
చిల‌గ‌డ దుంప‌: ఒక‌టి
చామ‌దుంప‌: అర క‌ప్పు
గుమ్మ‌డి కాయ ముక్క‌లు: అర క‌ప్పు
ముల‌క్కాడ‌లు: రెండు
క‌రివేపాకు: రెండు రెమ్మ‌లు
కొత్తిమీర : ఒక క‌ట్ట‌
నువ్వుల నూనె: స‌రిప‌డినంత‌
ఉప్పు:స‌రిప‌డినంత‌
సాంబారు పొడి : ఒక చెంచా

త‌యారీ విధానం :
స్టెప్1:
ముందుగా ప‌ప్పు ఉడికించి పెట్టుకోవాలి. అన్నం వండేయాలి. చింత‌పండు ర‌సం తీసి ప‌క్క‌న పెట్టుకోవాలి.
స్టెప్2: స్టౌపై ఒక గిన్నె పెట్టుకొని కూర‌గాయ ముక్క‌లు అన్ని వేసి కొన్ని నీళ్లుపోసి ఉడికించాలి.
స్టెప్3: స్టౌపై మ‌రో గిన్నె పెట్టుకొని చింత‌పండు ర‌సం కొన్ని నీళ్లు, సాంబారు పొడి, ఉడికించి పెట్టుకున్న కూర‌గాయ ముక్క‌లు, క‌రివేపాకు, ఉప్పు వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
స్టెప్4: ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ప‌ప్పు, అన్నం కాస్త మెత్త‌గా చేసుకొని వేసుకొని స‌న్న‌ని మంట పై అన్నం ద‌గ్గ‌ర‌కు అయ్యే వ‌ర‌కు ఉంచుకొని కొత్తిమీర‌, నువ్వుల నూనె వేసి దింపేయాలి. అంతే టెంపుల్ స్టైల్ క‌దంబం టేస్టీగా ఉంటుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress