అద్దాల గౌన్ల‌తో అందాల తార‌లు ఆస్కార్‌బ‌రిలో మెరిసారిలా!

ప‌గిలిన ముక్క‌ల‌ను అతికించ‌డం క‌ష్ట‌మంటారు, కానీ గౌనులాగా కుట్టేయొచ్చున‌ని నిరూపించారు. అలాగే చిన్న చిన్న గ్లాస్ ముక్క‌ల‌తో అంద‌మైన న్యూడ్ ఫ్రాక్ కుట్టేశారు. ఇప్పుడీ గౌన్లే ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద మెరిసిపోతున్నాయి.

రెడ్ కార్పెట్ మీద న‌డువ‌డ‌మంటేనే త‌ళుకులు, మిణుకులు ఉండి తీరాల్సిందే! అంతేకాదు.. బాల్ గౌన్లు, లాంగ్ ఫ్రాక్స్ అలా న‌డుచుకుంటూ వ‌స్తుంటే చూడ‌డానికి రెండు క‌ళ్లూ చాల‌వు. అలాంటి ఈవెంట్‌లో మిణుకుమ‌నే మిర్ర‌ర్ థీమ్‌తో గౌన్లు వేసుకున్న హీరోయిన్స్ ఆస్కార్ అవార్డుల ఫంక్ష‌న్‌లో స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచారు.

సెలీనా గోమెజ్.. రెడ్ కార్పెట్ మీద అంద‌రిలో డిఫ‌రెంట్‌గా ఉండాల‌నుకుంది. అందుకే 12మంది ఆర్టిషీయ‌న్స్ ఈ క్రిస్ట‌ల్ గౌన్ కోసం క‌ష్టప‌డ్డారు. మొత్తం 16వేల గ్లాస్ ముక్క‌ల‌ను అందంగా న్యూడ్ గౌన్ రూపంలో అందంగా కుట్టారు. సెలీనా ఈ డ్రెస్ మీద‌కి సింపుల్‌గా ఒక డైమండ్ నెక్లెస్ వేసుకుంది. ఈ ఈవెంట్‌కి ఆమె త‌న బాయ్‌ఫ్రెండ్‌తో క‌లిసి అడుగుపెట్టింది. ఆస్కార్ బ‌రిలో తాను న‌టించిన చిత్రం ఎమిలియా పెరెజ్‌పోటీలో ఉంది.

హాలె బెర్రీ.. ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన మొద‌టి నుంచే రెడ్ కార్పెట్ ట్రెండ్ సెట్ట‌ర్‌గా పేరుతెచ్చుకుంది. ఈసారి కూడా ఆమె త‌ళుక్కున మెరువ‌డానికి విచ్చేశారు. వెండి జిలుగుల్లా మెరిసిపోవ‌డానికి 7వేల అద్దాల క్రిస్ట‌ల్స్‌తో త‌యారు చేశారు. దీన్ని ఒంటికి అతుక్కుపోయేలా ఉండే టాప్‌, సాగ‌ర‌క‌న్య స్టైల్‌తో క‌నిపించేలా స్క‌ర్ట్ కుట్టించింది. ఈ డ్రెస్‌కి త‌గ్గ‌ట్టుగానే మెరిసిపోయే చెవి క‌మ్మ‌లు, ఉంగ‌రం ధ‌రించింది. అయితే ఈ న‌టి కూడా ఈసారి ఆస్కార్ బ‌రిలో పోటీ ప‌డ‌డం లేదు.

కుక్క‌పిల్ల‌, స‌బ్బుబిల్ల‌, అగ్గిపుల్ల క‌విత‌కు కాదేదీ అన‌ర్హం అన్న‌ట్టు.. గాజు ముక్క‌లు కూడా ఫ్యాష‌న్ కాదు అన‌ర్హం అంటున్నారు ఫ్యాష‌నిస్టులు. అందుకే ఈ న‌టీమ‌ణులిద్ద‌రూ కూడా ఈ ఆస్కార్ బ‌రిలో లేన‌ప్ప‌టికీ త‌మ అందాల గౌన్ల‌తో అంద‌రి చూపు త‌మ వైపు తిప్పుకొనేలా చేశారు. ఈ అందాల భామ‌లే కాదు.. ఇంకా చాలామంది రెడ్ కార్పెట్ మీద హోయ‌లుపోతూ క‌నిపించారు.

1 thought on “అద్దాల గౌన్ల‌తో అందాల తార‌లు ఆస్కార్‌బ‌రిలో మెరిసారిలా!”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress