కావాల్సిన పదార్థాలు :
బాస్మతీ రైస్ : ఒక కప్పు
పన్నీర్: పావు కప్పు
క్యాప్సికం: సగం
ఉల్లిపాయ : ఒకటి
క్యారెట్ : సగం
కార్న్ ఫ్లోర్: ఒక టీ స్పూన్
కారం: అర టీ స్పూన్
మిరియాల పొడి: పావు టీ స్పూన్
సోయా సాస్: ఒక టీ స్పూన్
అల్లం వెల్లులి పేస్ట్: అర టీ స్పూన్
నెయ్యి : ఒక టీ స్పూన్
కొత్తిమీర : అర కట్ట
ఉల్లికాడలు: అర కట్ట
ఉప్పు, నూనె : సరిపడినంత
తయారీ విధానం:
స్టెప్1: ముందుగా అన్నం వండి పెట్టుకోవాలి. పన్నీర్ చిన్నగా కట్ చేసి కార్న్ ఫ్లోర్ లో టాస్ చేసి పెట్టుకోవాలి.
స్టెప్2: క్యాప్సికం, క్యారెట్ చిన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ, ఉల్లికాడలు సన్నగా కట్ చేసుకోవాలి.
స్టెప్3: స్టౌ పై ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసి కార్న్ ఫ్లోర్ లో టాస్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
స్టెప్4: ఇప్పుడు అదే కడాయిలో నెయ్యి, రెండు టీ స్పూన్ల నూనె వేసి వేడి ఐన తర్వాత కట్ చేసుకున్న ఉల్లి పాయ, క్యాప్సికం, క్యారెట్ వేసి ఉడికిన తర్వాత అల్లం వెల్లులి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయిన తర్వాత వేయించి పక్కన పెట్టకున్న పన్నీర్ ముక్కలు వేసి కలుపుకొని కారం, మిరియాల పొడి, సోయా సాస్, ఉప్పు వేసి ఒక సారి కలుపుకోవాలి.
స్టెప్5: ఇప్పుడు వండి పెట్టుకున్న అన్నం వేసి కలుపుకొని చివరిలో కొత్తిమీర , ఉల్లికాడలు వేసి కలిపి అన్నం వేడి అయ్యే వరకు ఉంచుకొని సర్వ్ చేసుకోవాలి.
