ఆరోగ్యంగా.. ఫిట్ గా ఉండాలంటే వ్యాయామాలు చాలా ముఖ్యమైనవి. డబుల్ గడ్డం తగ్గించడంలో కొన్ని ఉత్తమమైన మార్గాలున్నాయి.
రోజు వారీ పనుల్లో వ్యాయామం కూడా తప్పనిసరి. డబుల్ చిన్ సమస్య ఉన్నవాళ్లు ఇతర వ్యాయామాలతో పాటు ప్రత్యేక వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అవేంటంటే..

- గడ్డం కింద టెన్నిస్ లేదా క్రికెట్ బాల్ ఉంచండి. ఇప్పుడు బంతిని గొంతు పై నొక్కిన విధంగా మీ ముఖాన్ని ఉంచండి. ఈ వ్యాయామాన్ని క్రమం తప్పకుండా 25 నుంచి 30సార్లు చేయండి. ఈ వ్యాయామం వల్ల అదనపు కొవ్వు తగ్గుతుంది. ఎప్పటి నుంచో కోరుకునే పర్ఫెక్ట్ షేప్ ఫేస్ మీ సొంతమవుతుంది.

2. ఈ వ్యాయామానికి ఎక్కువ శ్రమ అవసరం లేదు. ఇది చేయడం సులభం. డబుల్ చిన్ తగ్గించుకోవడానికి లోతైన శ్వాస తీసుకోండి. ఆ తర్వాత గడ్డం ఎడమ భుజానికి వంచండి. అప్పుడు దానిని తిరిగి మధ్యలోకి లాగి కుడి భుజానికి వంచండి. ఈ వ్యాయామాన్ని 5 నుంచి 10 నిమిషాలు చేయండి.

3. ఈ వ్యాయామం చేయడానికి మీరు పై కప్పును చూస్తుండాలి. ఆ తర్వాత ఈ స్థితిలో ఉంటూనే దంతాలను గ్రైండ్ చేసినట్టు కింది దవడను ముందుకు సాగదీయాలి. సుమారు 10 సెకన్ల పాటు ఈ స్థితిలో ఉంచి విశ్రాంతి తీసుకోవాలి. మళ్లీ కాసేపటి తర్వాత ఇలాగే చేయాల్సి ఉంటుంది.

4. ఈ వ్యాయామం దవడ, గొంతు, మెడతో సహా చాలా ముఖ కండరాలను సాగదీయంలోసహాయపడుతాయి. ఈ వ్యాయామం చేసేటప్పుడు మీ పెదాలను మాత్రమే ఉపయోగించాలి. తలను పైకి ఎత్తి పై కప్పును ముద్దడాతున్నట్లుగా పెదాలను బిగుతుగా చేయండి. మెరుగైన ఫలితాలం కోసం ఈ వ్యాయామాన్ని 10 నుంచి 20 సార్లు చేయండి.