ఐర‌న్ పాల‌క్‌.. అహ్ ఉల్లికారం.. విత్ రైస్ అండ్ రోటీ!

కావాల్సిన‌విః
పాల‌కూరః మూడు క‌ట్ట‌లు
ఉల్లిగ‌డ్డ‌లుః 3 (చిన్న‌వి)
వెల్లుల్లిపాయ‌లుః 10 రెబ్బ‌లు
కారంః ఒక టేబుల్‌స్పూన్
ఆవాలుః అర టీస్పూన్
జీల‌క‌ర్రః పావు టీస్పూన్
శ‌న‌గ‌ప‌ప్పుః పావు టీస్పూన్
మిన‌ప‌ప‌ప్పుః పావు టీస్పూన్
ఎండుమిర్చిః 4
క‌రివేపాకుః ఒక రెమ్మ‌
ప‌సుపుః చిటికెడు
ధ‌నియాల‌పొడిః పావు టీస్పూన్
నూనె, ఉప్పుః త‌గినంత‌

త‌యారీః
స్టెప్ 1ః
పాల‌కూర‌ను వీలైనంత చిన్న‌గా క‌ట్ చేసుకొని క‌డిగి ప‌క్క‌న పెట్టుకోవాలి. కాడ‌లు ముదురు ఉంటే వాటిని క‌ట్ చేయొద్దు.
స్టెప్ 2ః మిక్సీజార్‌లో ఉల్లిపాయ ముక్క‌లు క‌ట్ చేసి వేసుకోండి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బ‌లు, కారం, ఉప్పు వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టండి.
స్టెప్ 3ః ఇప్పుడు క‌డాయి పెట్టి నూనె పోసి ఆవాలు, జీల‌క‌ర్ర వేసి చిట‌ప‌ట‌మ‌న్న త‌ర్వాత శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప‌ప‌ప్పు వేసి వేయించాలి.
స్టెప్ 4ః దీంట్లో ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి వేగిన త‌ర్వాత మిక్సీ ప‌ట్టిన ఉల్లిపాయ పేస్ట్‌ని వేసి బాగా క‌లుపాలి.
స్టెప్ 5ః ప‌చ్చి వాస‌న పోయేవ‌ర‌కు దీన్ని క‌లుపుతుండాలి. నూనె కాస్త పైకి వ‌చ్చేవ‌ర‌కు అలా క‌లిపిన త‌ర్వాత పాల‌కూర వేసి ఒక‌సారి క‌లిపి మూత పెట్టేయాలి.
స్టెప్ 6ః రెండు నిమిషాల త‌ర్వాత మూత తీసి క‌లుపాలి. ప‌ది నిమిషాల పాటు మూత ఉంచి ఉడ‌క‌నివ్వాలి. మ‌ధ్య‌మ‌ధ్య‌లో మాత్రం క‌లుప‌డం మ‌ర‌చిపోవ‌ద్దు.
స్టెప్ 7ః ఇప్పుడు.. ప‌సుపు, ధ‌నియాల పొడి వేసి క‌లిపి మ‌రో రెండు నిమిషాలు ఉంచి దించేస్తే స‌రిపోతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress