కావాల్సిన పదార్థాలు :
అటుకులు : అర కప్పు
బెల్లం : 3/4 కప్పు
పాలు : ఒక కప్పు
కొబ్బరి పాలు : ఒక కప్పు
యాలకుల పొడి : చిటికెడు
అల్లం పొడి : చిటికెడు
నెయ్యి : ఒక టేబుల్‌స్పూన్
జీడిపప్పులు : 8
కిస్‌మిస్ : 8
తయారీ విధానం :
స్టెప్ 1: అటుకులను కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలి. దీనివల్ల అటుకులు చాలా క్రిస్పీగా తయారవుతాయి.
స్టెప్ 2 : ఒక గిన్నెలో అర కప్పు నీళ్లు పోసి బెల్లం వేసి కరిగించుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఆ నీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ 3 : ఇప్పుడు మరొక గిన్నెలో ఒక కప్పు నీళ్లు పోసుకొని వేడయ్యాక వేయించుకున్న అటుకులను వేసి మెత్తగా ఉడికించుకోవాలి.
స్టెప్ 4 : ఇందులోనే బెల్లం నీళ్లను పోసి మరికాసేపు ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత పాలు పోసి, యాలకుల పొడి వేసి బాగా కలుపాలి.
స్టెప్ 5 : అది ఉడుకుతున్నప్పుడే కడాయిలో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్ వేయించి పెట్టుకోవాలి. అటుకులు మరో ఐదు నిమిషాల్లో దించేసుకునే సమయంలో కొబ్బరి పాలు, వేయించుకున్న వీటిని వేయాలి. అంతే అటుకుల పాయసం రెడీ!
