కావాల్సిన పదార్థాలు:
సాబుదానా: రెండు కప్పులు
చక్కెర: రెండు కప్పులు
మిల్క్ పౌడర్: అర కప్పు
పాలు: లీటరు
కుంకుమ పువ్వు: చిటికెడు
యాలకులు: ఐదు
తయారీ విధానం:
స్టెప్1: ముందుగా సాబుదానా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి.
స్టెప్2: నానబెట్టుకున్న సాబుదానా, అరకప్పు చక్కెర, మిల్క్‌పౌడర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
స్టెప్3: మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఒక గిన్నెలో వేసుకొని దానిని చిన్న చిన్న వుండలుగా చేసి పెట్టుకోవాలి.
స్టెప్4: స్టౌ పై ఒక గిన్నె పెట్టుకొని పాలు పొసి మరుగుతున్నప్పుడు చక్కెర, కుంకుమ పువ్వులో కొన్ని పాలు పోసి కలుపుకొని వేసుకొవాలి.
స్టెప్5 : మరుగుతున్న పాలలో ముందుగా చేసి పెట్టుకున్న సాబుదానా ఉండలను వేసి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా యాలకుల పొడి వేసి కలిపి దించేయాలి.
