సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ ఎంత సెన్సేషన్ సృష్టించిందో తెలుసు. అందులో రణ్‌బీర్ కపూర్ లుక్‌ని, అందులోని సీన్స్‌ని కాపీ కొట్టి ఈ- బైక్ ప్రకటనలో కనిపించాడు ఎంఎస్ ధోని. ఈ యాడ్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
యానిమల్ సినిమాలో కొన్ని సీన్లు అందరికీ అలా గుర్తుండిపోయాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఆ దర్శకుడే కాపీ కొడితే ఎలా ఉంటుంది? రణ్‌బీర్ కపూర్ క్యారెక్టర్లో ధోనీ ఉంటే ఎలా ఉంటుందో చూపించే ఒక ఈ -బైక్ యాడ్ చాలా నవ్వు పుట్టిస్తున్నది. ఎలక్ట్రిక్ సైకిల్ తయారీదారు అయిన ఈమోటోరాడ్ కోసం ఈ యాడ్ తీశారు.
యానిమల్ సినిమాలో రణబీర్ తన కారు నుంచి బయటకు వెళ్లి తన గ్యాంగ్‌తో రోడ్డు దాటే సన్నివేశాలను అనుకరిస్తూ ధోని కనిపించాడు. అయితే ట్విస్ట్ ఏమిటంటే ఈ లెజెండ్ క్రికెటర్ ఎలక్ట్రిక్ సైకిల్‌తో రోడ్డు దాటాడు. అది అయిపోగానే సందీప్ రెడ్డి ధోనిని ప్రశంసించాడు. ఆ తర్వాత సీన్లో డైలాగ్స్‌తో అదరగొట్టాడు ధోనీ. మధ్యలో జుట్టు గురించి కూడా ధోనీ కామెంట్ చేశాడు. దీనికి ఇది భారీ విజయం సాధిస్తుందని వంగా ప్రకటించాడు. దీనితో ధోని తాను అతిగా చేస్తున్నానా? అని ఆశ్చర్యపోయాడు. ఇది ఎలక్ట్రిక్ సైకిల్ కోసం చేసిన ప్రకటన అని అతను దర్శకుడికి తెలియజేయాల్సి వచ్చిందని, కానీ వెనక్కి తగ్గడానికి ఇష్టపడలేదు. చివరి షాట్ మాత్రం యానిమల్ సీన్‌ని దించేశాడు ధోనీ.
43 ఏళ్ల లెజెండ్‌ను చైన్నై ఫ్రాంచైజీ 4 కోట్లకు కొన్నది. ధోని IPL 2025 కోసం ఇప్పటికే సిద్ధమయ్యాడు. ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో MS ధోనికి 18వ సీజన్. అతని జట్టు CSK మార్చి 23న చెన్నైలో జరిగే సీజన్‌లోని తమ మొదటి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.