కావాల్సిన పదార్థాలు :
చపాతీలు : 3
ఆవాలు : ఒక టీస్పూన్
జీలకర్ర : ఒక టీస్పూన్
కారం : ఒక టీస్పూన్
ధనియాల పొడి : ఒక టీస్పూన్
పసుపు : అర టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు : 2
నీళ్లు : 1 1/2 కప్పులు
నూనె : 2 టీస్పూన్స్
కొత్తిమీర : చిన్నకట్ట
ఉప్పు : తగినంత
తయారీ విధానం :
స్టెప్ 1 : వెల్లుల్లి పొట్టు తీసి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. చపాతీలను కూడా చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
స్టెప్ 2 : ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి పాయ ముక్కలను వేసి వేయించాలి.
స్టెప్ 3 : దీంట్లో కారం, ధనియాల పొడి, ఉప్పు, పసుపు వేసి ఒక నిమిషం తర్వాత నీళ్లు పోసి మరగనివ్వాలి.
స్టెప్ 4 : నీళ్లు కాస్త ఉడుకు పట్టిన తర్వాత ముక్కలుగా వేసుకున్న చపాతీలను వేసి కలుపాలి. ఇవి నీటిని పీల్చుకొని కూర దగ్గరకు అవుతుంది.
స్టెప్ 5 : చివరగా కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తే రుచి అదరహో అనాల్సిందే! ఈ కూరని అలా ఊరికే కూడా తినేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది.
