స‌తీ లీలావ‌తి

ఓహ్ గుప్పెడంత ఆశ పెట్టుకుంటే కొంప ముంచి పోయేరో
బాహుబలి లాంటి ఈ బావను బద్నాము చేసిందిరో
గుండెలోన డప్పులు కట్టి పూజలే చేసారో..
చిన్ననాటి ఈ దేవదాసు ను చీ కొట్టి పోయిందిరో…

ఓహో.. ఓహో..

మెరికలాంటి కుర్రోడమ్మా
చురుకు చూపు చిన్నోడమ్మా
మన‌సులోంచి కాసేపైనా పోనే పొడమ్మా

వలపు చిచ్చు పెట్టడమ్మా
వరుడి వేషం కట్టాడమ్మా
వాడివూసే రేయీ పగలూ అయ్యో రామా

సిద్ధమైంది కల్యాణ మాల
సిగ్గులేమౌనో తెల్లారేకల్లా
సంబరాల సందె వేళ
గట్టిమేలమిక వాయించరేలా…

ఓయే పిల్లా రాయే పిల్లా
చిక్కావే చక్కని చిత్తూరు పిల్లా
పానమల్లా తేనె చల్లా
నవ్వుతుంటే గుండె జల్లా

ఓయే పిల్లా రాయే పిల్లా
చిందేసి ఆడేటి చిత్తూరు పిల్లా
వెల్లువాయే పెళ్లి కల
ఇన్నినాళ్ళ తీపి కల తీరుతుంటే లేదంటే నమ్మేలా…
ఓహోహో…

మెరిక లాంటి కుర్రోడమ్మా
చురుకు చూపు చిన్నోడమ్మా
వాడి వెంట సాగేదాకా ఆగేనా.. నా ప్రేమ

వాడ్ని ముద్దుతూ రోజంతా మురిపించేస్తాలే
చంటి పిల్లాడిలా కొంగుకే కట్టేసుకుంటాలే
ఎన్ని తప్పుల్ని చేస్తున్నా మన్నించేస్తాలే
కంట నీరైనా రాకుండా కాపాడుకుంటాలే

ఇద్దరి మధ్య యుద్దాలు వస్తే నేనే సారీ చెబుతాలే
అందరి ముందు శ్రీవారి గొప్పలు చాటింపు వేస్తాలే
ఎంత ప్రేముందే వాడంటే పిల్ల యాడ ఈ ఆశలెల్ల
మాటలేల మాపటేల మూడు ముళ్ల గోల కానిస్తే పోలా

ఓయే పిల్లా రాయే పిల్లా
చిక్కావే చక్కని చిత్తూరు పిల్లా
పానమల్లా తేనె చల్లా
నవ్వుతుంటే గుండె జల్లా

ఓయే పిల్లా రాయే పిల్లా
చిందేసి ఆడేటి చిత్తూరు పిల్లా
వెల్లువాయే పెళ్లి కల
ఇన్నినాళ్ళ తీపి కల తీరుతుంటే లేదంటే నమ్మేలా…
ఓహోహో..

తోడులేని దారిలోని తొలిపరిచయమిదిగా
ప్రేమ కోరి జారుతున్న మనసిక నిలువదుగా
తడబడు అడుగులు మెల్లగా నడిచెను తన వెనక
లోలోన నా మది వింతే చూసాక
మురిసెనుగా వలపులు మొదలవగా
పలికిన వేద మంత్రమే కొసరెను ప్రేమ పరవసమే
కలలని హృదయము కరిగిన సమయము
త్వరపడమని తరిమెను తనకిక జతగా…

సంగీతం : మిక్కీ జె మేయర్
సాహిత్యం: వనమాలి
గాయకులు: నూతన మోహన్, కృష్ణ తేజేస్వి, రితేష్ జి రావు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress