కావాల్సిన పదార్థాలు :
పచ్చి బొప్పాయి కాయ: ఒకటి
చక్కెర: రెండు కప్పులు
వెనీలా ఎసెన్స్: ఒక స్పూన్
ఫుడ్ కలర్: ఎరుపు, పసుపు, ఆకు పచ్చ, నారింజ రంగు
తయారీ విధానం:
స్టెప్1: ముందుగా బొప్పాయి కాయ చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి.
స్టెప్2: ఇప్పుడు స్టౌ పై ఒక గిన్నె పెట్టుకొని కట్ చేసుకున్న బొప్పాయి ముక్కలు తగినన్ని నీళ్లు పోసి ఐదు నిమిషాల పాటు ఉడికించి నీళ్లు తీసేసి పక్కన పెట్టుకోవాలి.
స్టెప్3: ఇంకో గిన్నెలో చక్కెర రెండు గ్గాసుల నీళ్లు పోసి మరిగించుకోవాలి.
స్టెప్4: మరుగుతున్న చక్కెరలో ఉడికించుకున్న బొప్పాయి ముక్కలు వేసి చక్కెర పాకం తీగ పాకం వచ్చి ముక్కలకి పట్టే వరకు ఉంచుకొని వెనీలా ఎసెన్స్ వేసి కలుపుకోవాలి.
స్టెప్5: ఇప్పుడు బొప్పాయి ముక్కలని నాలుగు బాగాలు చేసి ఫుడ్ కలర్ వేసి కలుపుకొని నైట్ మొత్తం ఉంచాలి. తర్వాతి రోజు వాటిలో మిగిలిన చక్కెర నీళ్లు తీసేసి ఎండలో ఎండబెట్టుకోవాలి. అంతే టూటీ ఫ్రూటీ మీ ముందుంటుంది.