కేర‌ళ‌లోని మొద‌టి విడాకుల శిబిరం హిట్‌.. నెట్టింట వైర‌ల్ అవుతున్న వీడియో!

విడాకుల శిబిరం ఏంటి? అది స‌క్సెస్ కావ‌డ‌మేంట‌ని కంగారుప‌డ‌కండి. కేర‌ళ‌లో ఒక కంటెంట్ సృష్టిక‌ర్త ఈ శిబిరం ఏర్పాటు చేసి ఒంట‌రిగా ఉన్న మ‌హిళ‌ల‌కు బాస‌ట‌గా నిలుస్తున్న‌ది. ఇంత‌కీ వారు ఏం చేశారో ఈ క‌థ‌నం పూర్తిగా చదివితే మీకే అర్థ‌మ‌వుతుంది.

మిగ‌తా దేశాల్లోనేమో కానీ.. భార‌త‌దేశంలో మాత్రం విడాకులు తీసుకున్న జంట‌ను, అందులోనూ ఆడ‌వాళ్ల ప‌రిస్థితి వ‌ర్ణ‌నాతీతంగా ఉంటుంది. ప్రేమ‌లేని బంధంలో ఎక్కువ కాలం ఎవ్వ‌రూ ఉండ‌లేరు. అయితే ఇది స‌మాజానికి పెద్ద‌గా ప‌ట్ట‌దు. విడాకుల దృక్ప‌థాన్ని మార్చే ల‌క్ష్యంతో కేర‌ళ‌లోని ఒక కంటెంట్ క్రియేట‌ర్ ప్రశంస‌నీయ‌మైన చొర‌వ తీసుకున్నారు. ఆమె ఎవ‌రో కాదు.. కాలిక‌ట్‌కి చెందిన ర‌ఫియా అఫీ. ఆమె ఇటీవ‌ల కేర‌ళ‌లో మొట్ట‌మొద‌టి విడాకుల శిబిరాన్ని నిర్వ‌హించారు. ఈ శిబిరం ప్రాథమికంగా విడాకులు తీసుకున్న, విడిపోయిన లేదా వితంతువు అయిన మహిళల బృందానికి ఒక ఆహ్లాదకరమైన విహారయాత్రలా ఏర్పాటు చేశారు.

View this post on Instagram

A post shared by Rafia (@cook_eat_burn)

వీడియో వైర‌ల్‌..
ఈ శిబిరానికి సంబంధించిన ఒక వీడియో ఆన్‌లైన్‌లో షేర్ చేయబడింది. ఇందులో అంద‌రూ స‌ర‌దాగా క‌నిపించారు. చాలామంది వివిధ కార్యకలాపాలలో మునిగిపోయినట్లున్నారు. ఈ వీడియో ఒక మహిళల తన‌ వ్యక్తిగత కథను కళ్ళు మూసుకొని పంచుకోవడం కూడా ఉంది. బ్రేక్ ఫ్రీ స్టోరీస్ అనే ఈ కార్యక్రమం క‌చ్చితంగా హిట్ అయ్యేలా అనిపించింది. ఎందుకంటే ఈ క్లిప్ నవ్వు, ప్రేమతో నిండి ఉంది. అయితే ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. చాలా మంది నెటిజన్లు ఈ చర్యను ఇష్టపడ్డారు. ర‌ఫియా ఇలాంటి శిబిరాలను మరిన్ని నిర్వహించి, వీలైనంత ఎక్కువ మందికి వైద్యం అందించాలని ప్రోత్సహించారు.

భావోద్వేగాల మిళితం
“మేము పిల్లల్లాగే నవ్వాం. మేము యోధులలా ఏడ్చాం. మేము పర్వతాల్లో అరిచాం. మేము నక్షత్రాల కింద నృత్యం చేసాం. ఎవరికీ అర్థం కాని కథలను మేము పంచుకున్నాం. అపరిచితులు ఆత్మ సోదరీమణులు అయ్యారు. మంటలు, పురోగతుల మధ్య ఎక్కడో మేము విముక్తి పొందాం” అని పోస్ట్ క్యాప్ష‌న్ రాశారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘బ్రేక్ ఫ్రీ స్టోరీస్’ అనే హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. ఈ పోస్ట్‌కి నుండి 47 వేలకు పైగా వీక్షణలను పొందింది. ఈ పోస్ట్‌కి కొంద‌రు నెటిజ‌న్లు “ఈ మహిళలు అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వారి పట్ల లోతైన గౌరవం!” అని,. “ఒక కేరలైట్‌గా ఇది గొప్ప నిర్ణయం, ఎందుకంటే ఈ రకమైన విడాకుల శిబిరాలు వారిని శారీరకంగా, మానసికంగా స్వస్థపరుస్తాయి” అని కామెంటారు. “మంచి చొరవ. మహిళలకు శుభాకాంక్షలు” అని మరొకరు కామెంట్లు జోడించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress