క‌ర్ణాట‌క‌ స్పెష‌ల్ మ‌ధుర‌మైన క్రంచీ స్నాక్స్‌ మ‌ధుర వ‌డ‌లు!

కావాల్సిన ప‌దార్థాలు :
ఉల్లిపాయ‌లు: నాలుగు
ప‌చ్చి మిర్చి:నాలుగు
అల్లం : ఒక ఇంచు ముక్క‌
ప‌ల్లీలు: గుప్పెడు
నువ్వులు: గుప్పెడు
జీడిప‌ప్పు:గుప్పెడు
బియ్యం పిండి : ఒక క‌ప్పున్నర‌
ర‌వ్వ‌: ఒక క‌ప్పు
ఉప్పు, నూనె : స‌రిప‌డినంత‌

త‌యారీ విధానం:
స్టెప్1:
ముందుగా ఉల్లిపాయ‌లు స‌న్న‌గా క‌ట్ చేసి పెట్టుకోవాలి. అల్లం, ప‌చ్చిమిర్చి క‌చ్చ‌ప‌చ్చ‌గా దంచి పెట్టాలి.
స్టెప్2: ఒక గిన్నె తీసుకొని క‌ట్ చేసుకున్న ఉల్లిపాయ‌లు, అల్లం, ప‌చ్చిమిర్చి పేస్ట్, ప‌ల్లీలు, నువ్వులు, జీడిప‌ప్పు, ఉప్పు వేసి ఒక‌సారి బాగా క‌లుపుకొన్న‌ త‌ర్వాత బియ్యం పిండి, ర‌వ్వ కూడా వేసి కొన్ని నీళ్లు పొసి చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి.
స్టెప్3: ఇప్పుడు క‌లిపిన‌ మిశ్ర‌మంను వ‌డ‌ల‌లా చేసి ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ పై క‌డాయి పెట్టుకొని నూనె పోయాలి.
స్టెప్4: నూనె వేడి అయ్యాక‌.. వ‌డ‌లు వేసి స‌న్న‌ని మంట‌పై వ‌డ‌లు గోల్డ్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించుకోవాలి. వీటిని అలాగే వేడిగా తింటే సూప‌ర్‌గా ఉంటాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress