పదకొండేళ్ల భారత సంతతికి చెందిన కవలలు ఐన్‌స్టీన్ కంటే ఎక్కువ ఐక్యూతో పిల్లల ఎలైట్ మెన్సా సభ్యత్వ క్లబ్‌లో చేరారు. మరి ఆ తెలివైన పిల్లల గురించి తెలుసుకోకపోతే ఎలా..?
క్రిష్, కైరా అరోరా.. బ్రిటీష్‌లో ఉంటున్న కవలలు. 314 మంది ఉన్న పిల్లల ఎలైట్ మెన్సా సభ్యత్వ క్లబ్‌లో చేరారు. 162 స్కోరు సాధించి క్రిష్ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కంటే తెలివైన వాడిగా పేరుగాంచాడు. ఐన్‌స్టీన్ ఐక్యూ 160 స్కోరు ఉంటుందని అందరూ నమ్ముతారు.
గత నవంబర్‌లో 10 సంవత్సరాల వయస్సులో మెన్సాలో చేరిన ఈ కవలలు ఆ సమయంలో 152 ఐక్యూ స్కోర్‌తో ఉన్నారు. కైరా ప్రస్తుతం 152 ఐక్యూ స్కోర్‌తోనే కొనసాగుతుంది. తన కవల సోదరుడి అడుగుజాడల్లో నడుస్తున్నది. మెన్సాలో సభ్యత్వానికి అర్హత సాధించడానికి వీరు గుర్తింపు పొందిన ఇంటెలిజెన్స్ పరీక్షలో సాధారణ జనాభాలో టాప్ 2%లో స్కోర్ చేయాలి. మెన్సా ఇంటర్నేషనల్ ప్రపంచంలోనే అతిపెద్ద, పురాతనమైన హై-ఐక్యూ సొసైటీ.
ఢిల్లీలో జన్మించి.. పుణేలో కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివిన సీనియర్ ఐటీ మేనేజర్ మౌలి పిల్లలే వీళ్లు. వీరు చాలా పోటీతత్వంతో ఉన్నారు. క్రిష్ కారణంగా మెన్సా పరీక్ష రాయడానికి కైరా ప్రేరణ పొందింది. “ఇది చాలా గర్వకారణం. వారు చాలా చిన్న వయస్సులో ఇది సాధించినందుకు తల్లిగా చాలా అద్భుతమైన అనుభూతిలో ఉన్నాను. మా పేరెంటింగ్ శైలి చాలా ఆచరణాత్మకమైనది. మేము వారితో రోజువారీ ప్రాతిపదికన చురుకుగా పాల్గొంటాము. క్రిష్ ప్రైవేట్ పియానో పాఠాలు నేర్చుకుంటాడు. వారాంతాల్లో రోబోటిక్స్ కూడా నేర్చుకుంటాడు. కైరా కవిత్వం రాస్తుంది” అని వారి తల్లి మౌలి చెబుతున్నది.

క్రిష్, కైరా తండ్రి ముంబైకి చెందిన ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అయిన నిశ్చల్ తన కుటుంబంతో కలిసి 25 సంవత్సరాల క్రితం యూకేకి వెళ్లారు. కవలలు పశ్చిమ లండన్‌లోని హౌన్స్లోలోని వారి స్థానిక రాష్ట్ర ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. “క్రిష్ చాలా విశ్లేషణాత్మకుడు. అతను సెప్టెంబర్‌లో 7వ తరగతిలోకి వెళతాడు. కానీ ఇప్పటికే అతను తొమ్మిదవ తరగతి గణితం చేయగలడు. కైరా ప్రస్తుతం తన పాఠశాల రాక్ బ్యాండ్‌లో గాయకురాలిగా ఉంది. అంతేకాదు.. ఆమె న్యాయవాది కావాలనుకుంటున్నది” అని తండ్రి నిశ్చల్ చెబుతున్నాడు.
క్రిష్ గణితాన్ని అధ్యయనం చేయడానికి కేంబ్రిడ్జ్‌కు వెళ్లి చివరికి యాక్చురీగా మారాలనుకుంటున్నాడు. యాక్చురీ అంటే ఆర్థిక బీమా విషయాలలో రిస్క్, అనిశ్చితిని అంచనా వేయడానికి గణితం, గణాంకాలు, ఆర్థిక సిద్ధాంతాన్ని ఉపయోగించే ఒక ప్రొఫెషన్. ఇంత ఐక్యూ ఉన్న కూడా ఈ పిల్లలిద్దరూ తాము నేర్చుకోవాల్సి ఉందని చెబుతున్నారు.