పవన టర్బైన్ల గరిష్టంగా సాధించగల శక్తి గుణకంపై పరిశోధన చేసిన బ్రిటిష్ ఏరోడైనమిస్ట్ హెర్మాన్ గ్లావెర్ట్ పనిని దివ్య త్యాగి మెరుగుపరిచింది. భారత సంతతికి చెందిన ఈ విద్యార్థిని శతాబ్దాల నాటి గణిత సమస్యను పరిష్కరించింది.
పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో.. భారత సంతతికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య త్యాగి, ఏరోడైనమిక్స్‌లో శతాబ్దాల నాటి గణిత సమస్యను సరళీకృతం చేసింది. దీనివల్ల పవన టర్బైన్ డిజైన్‌కు కొత్త అవకాశాలను కల్పించేందుకు ఆమె శ్రీకారం చుట్టింది. పెన్ స్టేట్ యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ విద్యార్థిని దివ్య త్యాగి పవన టర్బైన్ల గరిష్టంగా సాధించగల శక్తి గుణకంపై దృష్టి సారించిన బ్రిటిష్ ఏరోడైనమిస్ట్ హెర్మాన్ గ్లావెర్ట్ పనిని మెరుగుపరిచినట్లు ప్రకటించారు.

గ్లావెర్ట్ మోడల్ సామర్థ్యాన్ని పెంచినప్పటికీ, టర్బైన్ రోటర్‌పై పనిచేసే శక్తులు లేదా గాలి పీడనంలో బ్లేడ్లు ఎలా వంగి ఉంటాయి వంటి కీలకమైన అంశాలపై దృష్టి పెట్టలేదు. త్యాగి సాధించిన విజయం టర్బైన్‌పై పనిచేసే మొత్తం శక్తులను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా గ్లావెర్ట్ పనికి పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇది పవన టర్బైన్ డైనమిక్స్‌పై మరింత పూర్తి అవగాహనను అందిస్తుంది. ఆమె ష్రేయర్ ఆనర్స్ కాలేజ్ థీసిస్‌లో భాగంగా అండర్ గ్రాడ్యుయేట్ సమయంలో పూర్తి చేసిన పరిశోధన విండ్ ఎనర్జీ సైన్స్‌లో ప్రచురించబడింది.
విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి అనువైన ప్రవాహ పరిస్థితులను నిర్ణయించడం ద్వారా త్యాగి పని పవన శక్తి సాంకేతికత భవిష్యత్తును మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉందని తెలియచేసింది. పవన శక్తి ఉత్పత్తిని పెంచడానికి, ఖర్చులను తగ్గించడానికి ఆమె పరిశోధన పనికొస్తుంది. ఆమె ఉత్తమ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ థీసిస్‌గా ఆంథోనీ ఇ. వోల్క్ అవార్డును గెలుచుకున్నది.
దివ్య త్యాగి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో తన బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. ప్రస్తుతం కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ (CFD)లో అత్యాధునిక పరిశోధనలను నిర్వహిస్తోంది. ఆమె దృష్టి హెలికాప్టర్ ఫ్లైట్ సిమ్యులేషన్లను మెరుగుపరచడం, ఏవియేషన్ భద్రతను మెరుగుపరచడంపై ఉంది. ఈ ప్రాజెక్ట్‌కి నేవీ నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.