కావాల్సిన పదార్థాలు :
మినపప్పు : ఒక కప్పు
ఇడ్లీ రవ్వ : రెండున్నర కప్పులు
టమాటాలు : 2
కొత్తిమీర : ఒక కట్ట
పుదీనా : 4 రెమ్మలు
పచ్చిమిర్చి : 4
ఉప్పు : తగినంత
తయారీ విధానం :
స్టెప్ 1 : మినపప్పు, ఇడ్లీరవ్వను రెండు వేర్వేరు గిన్నెల్లో ఆరుగంటల పాటు నానబెట్టాలి.
స్టెప్ 2 : మిక్సీ జార్‌లో మినపప్పు, కొన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బి పెట్టాలి. దీంట్లో ఇడ్లీరవ్వ నీళ్లు లేకుండా మినపప్పు మిశ్రమంలో వేసి కలుపాలి.
స్టెప్ 3 : ఈ ఇడ్లీ పిండిని రాత్రంతా మూత పెట్టి అలాగే ఉంచాలి. ఉదయం తీసి ఇడ్లీ పిండిని మూడు భాగాలుగా చేయాలి.
స్టెప్ 4 : ఇప్పుడు టమాటాలు, రెండు మిర్చి, ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని ఒక భాగంలో వేసి కలుపుకోవాలి.
స్టెప్ 5: మిక్సీజార్‌లో కొ్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని రెండో భాగంలో కలిపి పెట్టాలి.
స్టెప్ 6 : ఈ మూడు భాగాలను ఇడ్లీ ప్లేట్‌లో ఒక వరుసలో ఎర్రని, తెల్లని, ఆకుపచ్చని ఇడ్లీలను వేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి. వేడిగా ఈ ఇడ్లీలను ఏదైనా చట్నీతో లాగించేయొచ్చు.