కావాల్సిన పదార్థాలు:
బియ్యం: ఒక కప్పు
నెయ్యి : 2 టీస్పూన్లు
జీడి పప్పు : ఒక గుప్పెడు
మిరియాలు : 2 టీస్పూన్లు
మినప పప్పు : 2 టీస్పూన్లు
జీలకర్ర : 2 టీ స్పూన్లు
ఎండు మిర్చి: రెండు
ఆవాలు : ఒక టీ స్పూన్
శనగ పప్పు : ఒక టీస్పూన్
కరివేపాకు: రెండు రెమ్మలు
నూనె, ఉప్పు: సరిపడినంత
తయారీ విధానం :
స్టెప్ 1: ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి అన్నం వండి పెట్టకొవాలి.
స్టెప్2: ఇప్పుడు స్టౌ పై ఒక కడాయి పెట్టుకొని అది వేడి అయిన తర్వాత మిరియాలు , మినప పప్పు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి మిరియాలు చిట్లే వరకు వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకోవాలి.
స్టెప్3: స్టౌపై ఇంకో కడాయి పెట్టుకొని నెయ్యి, నూనె పోసుకొని వేడి ఐన తర్వాత ఆవాలు, శనగ పప్పు, జీడి పప్పు , కరివేపాకు వేసి వేయించుకొని తగినంత ఉప్పు వేసి కలుపుకొని వండి పెట్టుకున్న అన్నం వేసుకొని కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన మిరియాల అన్నం రెడీ!