నల్లమచ్చల నివారణకు.. టమాటా ఫేస్ ప్యాక్స్!!

కొంద‌రికీ ఏ కాలంలో అయినా మొటిమలు వ‌చ్చేస్తుంటాయి. వాటి వ‌ల్ల నల్లమచ్చలు అందరినీ బాధిస్తుంటాయి. అందుకే ట‌మాటాతో ఫేస్ ప్యాక్స్ వేసుకొని చూడండి. మీరే తేడాను గ‌మ‌నిస్తారు.

చ‌ర్మం పొడిబార‌డం కొంద‌రికీ త‌రుచుగా జ‌రుగుతుంటుంది. దీనివ‌ల్ల మొటిమ‌ల స‌మ‌స్య‌లు ఎక్కువ అవుతుంటాయి. ఇత‌ర చ‌ర్మ స‌మ‌స్య‌లు కూడా ఉత్పన్నమవుతాయి. అయితే అన్నిక్రీములు అందరికీ పని చేయవు. అందుకే సహజంగా దొరికే టమాటాలను వాడాలంటున్నారు బ్యూటీషియ‌న్లు. మామూలు టమాటాలు తినడం కూడా ఆరోగ్యానికే కాదు.. అందానికి మంచిది. డార్క్ స్కిన్ సమస్య తగ్గేందుకు టమాటాలు బాగా పని చేస్తాయి.

  • కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఉన్నాయా? దీనికోసం టమాటాలను చక్రల్లా కోసం కళ్ల దగ్గర పెట్టాలి. లేదా తొక్క వరకు వేరు చేసి దాన్ని స్క్రబ్లా వాడొచ్చు. ఈ తొక్కల వల్ల చర్మం పై వృద్దాప్య లక్షణాలు తగ్గుతాయి. కాబట్టి దీన్ని కళ్ల చుట్టూ రాసి కాసేపు ఉంచి కడిగేయాలి.
  • చర్మంపై మురికి ఉన్నట్లు అనిపించినా, డల్ గా తూచినా టమాటాను కట్ చేసి చక్కెర లేదా బెల్లం అద్ది ముఖంపై సున్నితంగా రుద్దండి. కాసేపటి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న మృతకణాలు తొలిగిపోతాయి.
  • చర్మం మెరిసిపోవాలంటే టమాటాను పేస్ట్ చేయాలి. దీంట్లో 3 నుంచి 4 చుక్కల నిమ్మరసం కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పావుగంట పాటు అలాగే ఉంచాలి. తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా తరుచుగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కాకపోతే పొడి చర్మం ఉన్నవారు ఈ ప్యాక్ వేసుకోవద్దు.
  • టమాటాలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికం. ఇవి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. టమాటా రసంలో శనగపిండి, పెరుగు కలిపి చర్మానికి రాయాలి. పూర్తిగా ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.
  • టమాటా గుజ్జులో, తేనె కలిపి పేస్ట్లా చేసుకోవాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మంలో మార్పు గమనించవచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress