కావాల్సిన పదార్థాలు :
క్యాబెజీ : 250 గ్రా||
ఉల్లిగడ్డ :1
మైదా : 2 టీస్పూన్స్
కార్న్ ఫ్లోర్ : అర కప్పు
కారం : ఒక టీస్పూన్
అల్లం వెల్లులి పేస్ట్: ఒక టీస్పూన్
ధనియాల పొడి : ఒక టీస్పూన్
గరం మాసాలా : అర టీస్పూన్
టమాటా సాస్ః పావు టీస్పూన్
వెనిగర్ః పావు టీస్పూన్
పచ్చి మిర్చి : 2
నూనె, ఉప్పు :సరిపడినంత
కొత్తిమీర ః చిన్న కట్ట
తయారీ విధానం :
స్టెప్1: క్యాబెజీ, ఉల్లిగడ్డని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి.
స్టెప్2: కట్ చేసుకున్న క్యాబెజీలో కారం, ఉప్పు, అల్లం వెల్లులి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, మైదా, కార్న్ ఫ్లోర్ వేసి కలుపాలి. ఈ మిశ్రమంను చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
స్టెప్3: ఒక కడాయిలో నూనె పోసుకొని వేడి అయ్యాక చిన్న చిన్నగా చేసి పెట్టుకున్న బాల్స్ వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక టీస్పూన్ కార్న్ ఫ్లోర్‌లో కొన్ని నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి.
స్టెప్4: ఇప్పుడు ఇంకో కడాయిలో 2 టీస్పూన్ల ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలి.
స్టెప్ 5: ఆ తర్వాత టమాట సాస్, వెనిగర్, కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమం వేసి 2 నిమిషాల తర్వాత వేయించి పెట్టకున్న ఉండలను కూడా వేసి కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపి దించేయాలి.