కావాల్సిన పదార్థాలు :
మఖానా: ఐదు కప్పులు
జీడిపప్పు: ఒక కప్పు
బాదం పప్పు: ఒక కప్పు
యాలకులు: ఐదు
ఎండు కొబ్బరి పొడి: ఒక కప్పు
బెల్లం: కప్పున్నర
నెయ్యి: సరిపడినంత
తయారీ విధానం
స్టెప్1: ముందుగా స్టౌపై ఒక పాన్ పెట్టుకొని మఖానా వేసి సన్నని మంట మీద క్రిస్పీగా అయ్యేలా వేయించి పక్కన పెట్టుకోవాలి.
స్టెప్2: అదే పాన్‌లో నెయ్యి వేసి జీడి పప్పు, బాదం పప్పు వేసి దోరగా వేయించుకొని అందులొనే ఎండు కొబ్బరి పొడి కూడా వేసి మూడు నుండి ఐదు నిమిషాల పాటు వేయించి చల్లారనివ్వాలి.
స్టెప్3: స్టౌపై ఒక గిన్నెపెట్టుకొని అందులో బెల్లం తురుము సగం గ్లాసు నీళ్లు పోసి లేత పాకం పట్టుకోవాలి.
స్టెప్4: ఇప్పుడు చల్లారిన మఖానా కొద్దికొద్దిగా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే జీడి పప్పు, బాదం పప్పు, ఎండుకొబ్బరి పొడి, యాలకులు వేసి మిక్సీ పట్టుకోవాలి.
స్టెప్5: ఒక వెడల్పాటి గిన్నెతీసుకొని అందులోకి మిక్సీ పట్టుకున్న పొడిని వేయాలి. ఆ తర్వాత పాకం పట్టుకున్న బెల్లం, టీ స్పూన్ నెయ్యి వేసి కలుపుకొని లడ్డులు చుట్టుకోవాలి.
