కావాల్సినవి :
అరటిపండ్లు : 3
బ్రౌన్ షుగర్ : ఒక కప్పు
నూనె : అర కప్పు
కొబ్బరి నూనె : అర కప్పు
వెనీలా ఎసెన్స్ : ఒక టీస్పూన్
గోధుమ పిండి : 1 1/2 కప్పులు
బేకింగ్ సోడా : అర టీస్పూన్
బేకింగ్ పౌడర్ : అర టీస్పూన్
దాల్చిన పొడి : అర టీస్పూన్
ఉప్పు : తగినంత
తయారీ :
స్టెప్ 1ః ఒక గిన్నెలో అరటి పండు ముక్కులు, బ్రౌన్ షుగర్ వేసి మాషర్‌తో బాగా గుజ్జులా చేసుకోవాలి.
స్టెప్ 2ః దీంట్లో నూనె, కొబ్బరినూనె, వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలుపాలి.
స్టెప్ 3ః ఇందులోనే గోధుమపిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, దాల్చిన పొడి, ఉప్పు వేసి ఉండలు లేకుండా బాగా కలుపాలి. ఇలా కనీసం ఐదు నిమిషాలు కలిపితే మంచిది.
స్టెప్ 4ః దీన్ని ఒక మౌల్డ్‌లో మైదా వేసి ఈ మిశ్రమాన్ని పోయాలి. ఓవెన్లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ల వద్ద 45 నిమిషాల పాటు బేక్ చేయాలి. ఈ బ్రెడ్ వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది.