కావాల్సిన పదార్థాలు :
శనగపిండి : 3 కప్పులు
నెయ్యి : 3/4 కప్పు
పాలు : 1/3 కప్పు
చక్కెర : ఒక కప్పు
కుంకుమ పువ్వు : చిటికెడు
యాలకుల పొడి : ఒక టీస్పూన్
బాదం, పిస్తా : కావాల్సినంత
తయారీ విధానం :
స్టెప్ 1 : ఒక గిన్నెలో శనగపిండి వేసి 2 టేబుల్స్పూన్ల పాలు, నెయ్యి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
స్టెప్ 2 : ఒక పెద్ద గిన్నెలో నెయ్యి వేసి కలుపుకొన్న శనగపిండి మిశ్రమం వేసి నెయ్యి పైకి వచ్చేవరకు కలుపుతుండాలి. ఇది చేసేంత సేపు మంట పెద్దగా పెట్టి చేయాలి.
స్టెప్ 3 : ఒకసారి నెయ్యి పైకి వచ్చాక మంటను తగ్గించి పాలను పోస్తూ కలుపాలి. ఈ సమయంలో అడుగంటకుండా ఉండేలా చూసుకొని దీన్ని స్టౌ మీద నుంచి దించేయాలి.
స్టెప్ 4 : పక్కన మరో గిన్నెలో చక్కెర వేసి, కొన్ని నీళ్లు పోసి, యాలకుల పొడి వేసి పాకం చేసుకోవాలి. ఇది గట్టిపాకం వచ్చాక ముందు చేసుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసి కలుపాలి.
స్టెప్ 5 : శనగపిండి మిశ్రమం కూడా మరి వదులుగా కాకుండా, గట్టిగా అవ్వకుండా ఉన్న సమయంలో దించేయాలి. ఇప్పుడు ఒక ట్రే తీసుకొని నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని అందులో పోసి కాస్త చల్లారనివ్వాలి. ఆ తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని తినేయొచ్చు.
