నాలుగు ప‌దార్థాల‌తోనే చేసే మిల్క్ పుడ్డింగ్‌ స్వీట్ టేస్ట్ అదిరిపోతుంది!

కావాల్సిన ప‌దార్థాలు :
పాలు : 500 మి.లీ.
కార్న్‌స్టార్చ్ : 50 గ్రా.
చ‌క్కెర : 50 గ్రా.
కొబ్బ‌రితురుము : ఒక క‌ప్పు

త‌యారీ విధానం :
స్టెప్ 1 :
స‌గం పాల‌ను ఒక గిన్నెలో పోసి.. చ‌క్కెర వేసి బాగా క‌లిపి వేడి చేయాలి.
స్టెప్ 2 : ఈ లోపు ఒక గిన్నెలో మిగిలిన పాలు పోసి కార్న్‌స్టార్చ్ వేసి ప‌క్క‌కు పెట్టాలి.
స్టెప్ 3 : స‌న్న‌ని మంట మీద మ‌ళ్లీ 4 నిమిషాలు ఉంచాలి. దీంట్లోనే స్టార్చ్ వేసిన పాలు పోసి చిక్క‌గా అయ్యేలా వేడి చేయాలి.
స్టెప్ 4 : ఇప్పుడు ఒక ప్లేట్‌లో పారాచ‌మెంట్ పేపర్ వేసి పాలు పోసి రెండు గంట‌ల పాటు చ‌ల్లార‌నివ్వాలి.
స్టెప్ 5 : వాటిని చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి పెట్టుకొని పై నుంచి కొబ్బరి తురుము వేసి స‌ర్వ్ చేస్తే య‌మ టేస్టీగా ఉంటుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress