కావాల్సిన పదార్థాలు :
మైదా: రెండు కప్పులు
కొత్తిమీర :ఒక కట్ట
పుదీనా : సగం కట్ట
పచ్చిమిర్చి:రెండు
అల్లం: ఒక ఇంచు ముక్క
జీలకర్ర, ధనియాలు: ఒక టీస్పూన్
కళోంజి: ఒక టీస్పూన్
ఉప్పు, నూనె : సరిపడినంత
తయారీ విధానం:
స్టెప్1: ముందుగా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ధనియాలు వేసి మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి.
స్టెప్2: ఒక గిన్నెలోకి మైదా పిండి, ఉప్పు, మూడు టీ స్పూన్ల నూనె, కళోంజి, మిక్సీ పట్టుకున్న మిశ్రమం వేసి చపాతి పిండిలా కలుపుకొని ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి.
స్టెప్3: కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న వుండలుగా చేసుకొని పలుచగా ఒత్తుకొని త్రిభుజాకారంలో చేసుకొని పక్కన పెట్టాలి.
స్టెప్4: స్టౌ పై ఒక కడాయి లో వేయించుకొవాడానికి సరిపడా నూనె పోసుకొని వేడి ఐన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న నమ్కీలను గోల్డ్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. క్రిస్పీగా చాలా బాగుంటాయి.
