
కావాల్సిన పదార్థాలు :
మటన్ : 500 గ్రా.
ఉల్లిపాయలు : 2 (పెద్దవి)
ధనియాలు : అర టీస్పూన్
గరం మసాలా : పావు టీస్పూన్
అల్లం, వెల్లుల్లిపేస్ట్ : ఒక టేబుల్‌స్పూన్
కారం : 2 టేబుల్‌స్పూన్స్
కొత్తిమీర : ఒక కట్ట
జీడిపప్పు : 10
పెరుగు : ఒక కప్పు
టమాట : 1
పసుపు : పావు టీస్పూన్
ఉప్పు, నూనె : తగినంత
తయారీ విధానం :
స్టెప్ 1: మటన్ ని బాగా కడిగి అందులో కాస్త ఉప్పు, కారం, పెరుగు, పసుపు, ధనియాలపొడి వేసి కలిపి గంటపాటు పక్కన పెట్టాలి.
స్టెప్ 2ః ఇప్పుడు ఒక ఉల్లిపాయను మాత్రమే కట్ చేయండి. దాన్ని కుక్కర్‌లో కాస్త నూనె పోసి కలర్ మారేవరకు వేయించాలి. దీన్ని కాసేపు చల్లరనివ్వాలి.
స్టెప్ 3ః ఉల్లిపాయలను మిక్సీలో వేసి, దీంట్లోనే టమాటముక్కలు, జీడిపప్పు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి.
స్టెప్ 4ః మళ్లీ కుక్కర్‌లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి.
స్టెప్ 5ః ఇందులో ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్న మటన్‌ని వేసి బాగా కలుపాలి. ఐదు నిమిషాలు అలాగే ఉంచాలి.
స్టెప్ 6ః ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్‌ని కూడ వేసి బాగా కలుపాలి. ఆ తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసి మూత పెట్టేయాలి.
స్టెప్ 7ః కనీసం 8 విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి. అంతే సూపర్ టేస్టీ మటన్ గ్రేవీ కూర రెడీ అయిపోయినట్టే!