18 సంవత్సరాల ఆర్సీబీ కల మొత్తానికి నెరవేరింది. ఈ మ్యాచులో విరాట్‌తో పాటు ఆయన సతీమణి అనుష్క మీద కూడా అందరి దృష్టి ఉంది. ఈ మ్యాచ్‌కి అనుష్క వేసుకున్న డ్రెస్ ధర తెలిస్తే షాక్ అవ్వకమానరు.
ఎంతో సింపుల్‌గా డెనిమ్ జీన్స్, తెల్లని కాటన్ షర్ట్‌లో ఐపీఎల్ మ్యాచ్ ఫైనల్లో కనిపించింది అనుష్క శర్మ. సమ్మర్ స్పెషల్‌గా కూల్ లుక్‌లో కనిపించింది. అంతేకాదు.. చాంపియన్ ట్రోఫీ ఫైనల్లో బీడెడ్ నెక్కర్, షర్ట్‌లో కనిపించినట్లు.. ఈ ఫైనల్ మ్యాచులోకూడా బీడెడ్ ప్యాంటు వేసుకొచ్చింది అనుష్క. మొత్తానికి ఆమె బీడెడ్ థియరీ వర్కవుట్ అయినట్లుంది.
అనుష్కశర్మ వేసుకున్న ఈ డ్రెస్ మీద ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తున్నది. ఈ అమ్మడు వేసుకున్న జీన్స్.. శాండ్రో రైన్‌స్టోన్ అండ్ బీడెడ్ జీన్స్. దీని ధర 308 డాలర్ల రూపాయలు. అంటే.. సుమారు 25 వేల రూపాయల పై చిలుకు మాటే. ఇక తను వేసుకున్న ఓవర్ సైజ్డ్ ఆర్గానిక్ కాటన్ అలెగ్జాండర్వాంగ్ కంపెనీది. దీని ధర 245 డాలర్లు. అంటే.. 20వేల పై చిలుకు. ఇక తను ఎప్పుడూ వేసుకొనే కోటిన్నర బ్రాస్లెట్, వాచ్ ధరించింది. మేకప్ హెవీగా కాకుండా కాస్త సింపుల్ టచ్ ఇచ్చింది.
“అనుష్క నన్ను నా అత్యల్ప స్థితిలో చూసింది. నాతో అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఆమె అన్నీ అనుభవించింది. ఆమెకు బెంగళూరుతో లోతైన అనుబంధం ఉంది. ఆమె కూడా బెంగళూరు అమ్మాయి. RCBతో ఆమె బంధం బలంగా ఉంది. కాబట్టి ఇది ఆమెకు కూడా చాలా ప్రత్యేకమైనది. ఆమె చాలా గర్వంగా ఉంటుంది* అంటూ విరాట్ అనుష్క గురించి చెప్పుకొచ్చాడు.