కావాల్సిన పదార్థాలు:
స్వీట్ కార్న్: 2
నీళ్ళు : 2 గ్లాసులు
మైదా : 4 టీస్పూన్స్
కార్న్‌ఫ్లోర్ : 4 టీస్పూన్స్
పచ్చి మిర్చి :5
ఉల్లిపాయ : ఒకటి (పెద్దది)
వెల్లులి : 5 రెబ్బలు
పసుపు : పావు టీస్పూన్
చిల్లీ ఫ్లెక్స్: అర టీస్పూన్
మిరియాల పొడి :అర టీస్పూన్
గరం మసాలా :అర టీస్పూన్
ఉల్లి ఆకు : 1కట్ట
నూనె, ఉప్పుః సరిపడినంత
తయారీ విధానం:
స్టెప్ 1: గిన్నెలో నీళ్ళు పోపొసుకొని పసుపు, ఉప్పు, స్వీట్ కార్న్ వేసుకొని ఉడికించి కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు కార్న్ నుంచి గింజలను తీసి పెట్టుకోవాలి. స్టెప్ 2ః పచ్చి మిర్చి, ఉల్లిపాయ, వెల్లులి కట్ చేసి పెట్టుకోవాలి.
స్టెప్ 3: ఇప్పుడు చల్లారిన స్వీట్ కార్న్ లో నీళ్ళు లేకుండా మైదా, కార్న్‌ఫ్లోర్, మిరియాల పొడి, ఉప్పు వేసుకొని కలపాలి. నీళ్ళు అవసరమైతే వేసుకోండి.
స్టెప్ 4: ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకొని బాగా వేడి అయిన తర్వాత కలిపి పెట్టుకున్న స్వీట్‌కార్న్‌ని వేసి సన్నని మంట పై వేయించుకోవాలి.
స్టెప్ 5: ఇంకొ పాన్ పెట్టుకొని టీస్పూన్ ఆయిల్ వెసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చి మిర్చి, ఉల్లిపాయ, వెల్లులి వేసుకొని వేగిన తర్వాత స్వీట్ కార్న్ వేసి రెండు నిమిషాలు ఉంచాలి.
స్టెప్ 6: ఆ తర్వాత చిల్లీ ఫ్లెక్స్, గరం మసాలా, ఉప్పు, ఉల్లి ఆకు వేసుకొని ఒకసారి కలిపి దించేయాలి.