కావాల్సిన పదార్థాలు:
పాలు : 1/2 లీటర్
కస్టర్డ్ పౌడర్ : 3 టీస్పూన్స్
చక్కెర : 4 టీస్పూన్స్
దానిమ్మ గింజలు : 2 టీస్పూన్స్
బ్లాక్ & గ్రీన్ ద్రాక్ష : 3 టీస్పూన్స్
అరటి పండు : ఒకటి
ఆపిల్ : ఒకటి
తయారీ విధానం :
స్టెప్ 1: కస్టర్డ్ పౌడర్లో కొన్ని పాలు పోసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. అరటి పండు, ఆపిల్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
స్టెప్2 : స్టవ్ పై గిన్నె పెట్టుకొని పాలు పోసి మరిగించుకోవాలి. మరుగుతున్న పాలలో చక్కెర వేసుకొని చక్కెర కరిగిన తర్వాత కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమం పోసుకొని రెండు నిమిషాలు మరిగించి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి.
స్టెప్ 3 : పాలు చల్లారిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ద్రాక్ష , అరటి పండు, ఆపిల్, దానిమ్మ గింజలు వేసుకొని కలిపి ఒక గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.