పిల్ల‌ల‌కు లంచ్ బాక్స్‌లో టేస్టీగా చేసి పెట్టే.. క‌రివేపాకు క్యారెట్ రైస్!

కావాల్సిన ప‌దార్థాలు :
క‌రివేపాకు : ఒక క‌ట్ట‌
క్యారెట్ తురుము : ఒక క‌ప్పు
అన్నం : రెండు క‌ప్పులు
ధ‌నియాలు : ఒక టీస్పూన్
ఎండు మిర్చి : నాలుగు
జీల‌క‌ర్ర : ఒక టీస్పూన్
ప‌సుపు : అర టీస్పూన్
జీడిప‌ప్పులు : గుప్పెడు
ఉల్లిపాయ : ఒక‌టి
ప‌చ్చిమిర్చి : రెండు
ఉప్పు, నూనె : స‌రిప‌డినంత‌

త‌యారీ విధానం :
స్టెప్1:
ముందుగా అన్నం వండి పెట్టుకోవాలి.
స్టెప్2: క్యారెట్ తురిమి పెట్టుకోవాలి. ఉల్లిపాయ, ప‌చ్చిమిర్చి క‌ట్ చేసి పెట్టాలి.
స్టెప్3: స్టౌ పై ఒక పాన్ పెట్టుకొని అందులో ధ‌నియాలు, జీల‌క‌ర్ర, ఎండు మిర్చి, క‌రివేపాకు వేయించుకొని మిక్సీ ప‌ట్టి పెట్టుకోవాలి.
స్టెప్4: అదే క‌డాయిలో నూనె వేసి వేడి అయిన‌ త‌ర్వాత జీల‌క‌ర్ర‌, క‌ట్ చేసుకున్న ఉల్లిపాయ, ప‌చ్చిమిర్చి, జీడిప‌ప్పు, క్యారెట్ తురుము వేసి క్యారెట్ వేగిన త‌ర్వాత ప‌సుపు, ఉప్పు మిక్సీ ప‌ట్టి పెట్టుకున్న మిశ్ర‌మం వేసి క‌లుపుకొని అన్నం కూడా వేసి బాగా క‌లుపుకోవాలి. రెండు నిమిషాలు ఆగి స్టౌ ఆపేయాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress