కావాల్సిన పదార్థాలు:
చిక్కుడు కాయలు: 500గ్రా|.
కారం : 2 టీస్పూన్స్
పసుపు: అర టీస్పూన్
అల్లం వెల్లులి పేస్ట్: ఒక టీస్పూన్
వెల్లుల్లి: 10 రెబ్బలు
జీలకర్ర ః పావు టీస్పూన్
ఆవాలు: పావు టీస్పూన్
ధనియాల పొడి: ఒక టీ స్పూన్
జీలకర్ర మెంతుల పొడి: అర టీస్పూన్
నిమ్మకాయ: 1
నూనె: 100 గ్రా.
ఉప్పు: తగినంత
తయారీ విధానం:
స్టెప్ 1: చిక్కుడు కాయలు తుంచి శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా తుడిచి పెట్టుకోవాలి.
స్టెప్ 2: స్టౌ పై ఒక కడాయి పెట్టుకోని నూనె వేసుకొని వేడి అయ్యాక తుంచి పెట్టుకున్న చిక్కుడు కాయలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ 3: ఇప్పుడు మిగిలిన నూనెలో జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లులి లైట్ గొల్డ్ కలర్లోకి వచ్చాక అల్లం వెల్లులి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పొయే వరకు కలుపుతుండాలి.
స్టెప్ 4ః ఇందులో పసుపు, కారం, జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసుకోని స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
స్టెప్ 5ః ఇప్పుడు వేయించి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేయాలి. ఇందులో నిమ్మకాయ రసం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన చిక్కుడు కాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. దీంట్లో పోపు వేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది.