తీరొక్క పూలతో చేసే ఈ తొమ్మిది రోజుల బతుకమ్మల గురించి.. వాటి ప్రాముఖ్యత గురించి తెలుసా?
బతుకుకు సంబురాన్నిచ్చే పండుగ.. తెలంగాణ బతుకమ్మ పండుగ. తీరొక్క పూలతో.. ఆటపాటల కోలాహలంతో నిండిపోయే ఈ పండుగను తొమ్మిది రోజులు జరుపుతారు. అయితే ఈ పండుగ విశిష్టత గురించి మీకు తెలుసా? ఒక్కేసి పువ్వేసి సందమామ.. ఒక్క జాము ఆయే సందమామ.. అంటూ పాడుకుంటూ పూలతో బతుకమ్మను పేరుస్తారు. గునుగు.. తంగేడు.. బంతి.. చామంతి.. ఇలా ఒక్కో పువ్వును వరుసగా పేరుస్తూ అమ్మలక్కాలంతా చేరి ఆనందంగా ఈ పండుగను జరుపుకొంటారు. ఈ బతుకమ్మ తెలంగాణ ప్రజలకు ఒక […]









