ఏ ప్రొడక్ట్‌కైనా ప్రచారం తప్పనిసరి. ఒక్కొక్కరూ ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. అందులో హోర్డింగ్‌లు ఒకరకం. అయితే ఎప్పుడూ ఒకేలా కాకుండా బ్రిటానియా కాస్త కొత్తగా ఆలోచించింది. పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా తన బిల్‌బోర్డ్‌లను తయారుచేయించి ప్రధాన నగరాల్లో పెట్టింది.
మెట్రోపాలిటన్ నగరాల సందడిగా ఉండే వీధుల్లో హోర్డింగ్స్ ప్రధానమైనవి. అయితే, పెద్ద ఎల్ఈడీ డిస్ప్లేలు తరచుగా కంటికి చికాకు కలిగిస్తాయి. కొన్నిసార్లు ఆ హోర్డింగ్స్ కనపడకుండా చెట్లు అడ్డుపడుతుంటాయి. అయితే ఎప్పుడూ ఒకేలా ఉంటే బోర్ కొట్టేస్తుంది కదా! అందుకే బ్రిటానియా కంపెనీ కాస్త కొత్తగా ఆలోచించింది. పైగా తన ప్యాకెజింగ్ రీసైకిలేబుల్. అది కూడా జనాల్లోకి వెళ్లాలని ఈ బ్రాండ్ బహిరంగ ప్రకటనల ప్రచారం.. నేచర్ షేప్స్ బ్రిటానియా పేరుతో ప్రకృతిని మార్చడం కంటే దానికి ఎలా అనుగుణంగా హోర్డింగ్స్ పెట్టాలో చూపించింది. ఇప్పుడు ఆ హోర్డింగ్స్ గురించే దేశంలో ఉన్న ప్రధాన నగరాలు మాట్లాడుతున్నాయి.

సరికొత్తగా..
ప్రకృతిని పాడుచేయకుండా ఉండే ఎలాంటి ఆలోచననే అందరూ స్వాగతిస్తారు. అందుకే బ్రిటానియా ఆలోచన చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. మామూలు బోర్డ్ పెట్టినప్పుడు చెట్టు ఎదుగుదలకు అది అడ్డుగా నిలుస్తుంది. అలా కాకుండా ఆ చెట్టు ఆకృతిని బట్టి బోర్డ్ తయారు చేస్తే బాగుంటుందని ఆలోచించిందీ సంస్థ. అందుకే మీడియా ఏజెన్సీలు సాధారణంగా చెట్లతో అడ్డుగా ఉన్న బిల్‌బోర్డ్‌లను ట్రాక్ చేయవు కాబట్టి, సరైన ప్రదేశాలను కనుగొనడానికి బృందం బూట్స్-ఆన్-ది-గ్రౌండ్ విధానాన్ని ఆశ్రయించింది. ఫలితంగా పర్యావరణ స్పృహతో కూడిన ప్రచారం ఇతర ప్రకటనదారులు, మీడియా యజమానులకు సంకేతంగా నిలుస్తుంది. మంచి ప్రకటనలు ప్రకృతిని దెబ్బతీసేలా ఉండనవసరం లేదని చూపిస్తుంది.

ఈ ప్రచారం వెనుక..
ఈ ఆలోచనకు ప్రాణం పోసేందుకు బహుళ మీడియా భాగస్వాములతో కలిసి పనిచేసింది బ్రిటానియా. కోరల్ మీడియా భాగస్వామి సోనియా లాల్ ఈ ప్రచారానికి మద్దతు ఇవ్వడం పట్ల తన గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రకటనదారులకు భిన్నంగా ఆలోచించమని బలమైన సందేశాన్ని పంపుతుందని ఆయన అన్నారు. ప్రభావవంతమైన ప్రచారానికి పర్యావరణాన్ని దెబ్బతీయవలసిన అవసరం లేదని ఆయన తెలిపారు. అలాగే బ్రిటానియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమిత్ దోషి.. ఈహోర్డింగ్‌ల కోసం ఉపయోగించిన పదార్థం కూడా 100% కాటన్ బయోడిగ్రేడబుల్ అని, మా స్థిరత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా చూసుకున్నామని అన్నారు.
‘నేచర్ షేప్స్ బ్రిటానియా’ బిల్‌బోర్డ్‌లు హైదరాబాద్, కోల్‌కతా, మీరట్, పూణే.. ఈ నాలుగు నగరాల్లో సరికొత్తగా చేర్చబడ్డాయి. ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే ఆ బోర్డ్‌ల వంక ఒక లుక్కేయండి.