కావాల్సిన పదార్థాలు :
అటుకులు: రెండు కప్పులు
బియ్యం పిండి: ఒక కప్పు
పెరుగు: ఒక కప్పు
జీలకర్ర: ఒక టీ స్పూన్
కొత్తిమీర : ఒక కట్ట
కరివేపాకు: నాలుగు రెమ్మలు
అల్లం : ఒక ఇంచు ముక్క
వంట సోడా: అర టీ స్పూన్
నూనె, ఉప్పు: సరిపడినంత
తయారీ విధానం:
స్టెప్ 1: ముందుగా అటుకులని శుభ్రంగా కడిగి కొన్ని నీళ్లు పొసి ఒక ఐదు నిమిషాల పాలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత అందులో నీళ్లు లేకుండా చేసుకొని అటుకులు మెత్తగా అయ్యే వరకు బాగా కలుపుకోవాలి.
స్టెప్2: ఇప్పుడు అల్లం చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి పెట్టాలి.
ప్టెప్3: ఇప్పుడు మెత్తగా చేసుకున్న అటుకుల మిశ్రమంలో కట్ చేసుకున్న అల్లం, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు,పెరుగు, బియ్యం పిండి, వంట సోడా, కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి.ఈ మిశ్రమం వడలు చేసుకొవడానికి వీలుగా ఉండేలా చూసుకొవాలి.
స్టెప్4: స్టౌ పై ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకొని వేడి అయిన తర్వాత కలిపి పెట్టుకున్న మిశ్రమంను వడల్లా చేసుకొని సన్నని మంటపై గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
