కావాల్సిన పదార్థాలు :
మినపప్పు: ఒక కప్పు
మిరియాలు: ఒక టీస్పూన్
జీలకర్ర: ఒక టీస్పూన్
నూనె, ఉప్పు :సరిపడినంత
తయారీ విధానం :
స్టెప్1: మినప పప్పును 20 నుండి 30 నిమిషాలు పాటు నానబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో మినపప్పు, మిరియాలు, జీలకర్ర,తగినంత ఉప్పు నీళ్లు ఎక్కువగా వేసుకోకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి.
స్టెప్2: ఒక కడాయిలో నూనె ఎక్కువగా పోసుకొని వేడవనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమంను ఒక క్లాత్ పై పలుచగా వడలలాగా ఒత్తుకొని 2 నిమిషాల పాటు ఆగి వేడి ఐన నూనెలో వేసి సన్నని మంటపై లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉంచి తీసి పక్కన పెట్టుకొవాలి. అలా అన్ని వడలు వేసుకున్న తర్వాత మళ్ళి అన్ని వడలు నూనెలో వేసి కర కరలాడేలా కాల్చుకోవాలి.