చావా సినిమా ఇప్పుడు ఏ రేంజులో హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో విక్కీ కౌశల్ శంభాజీగా ఆకట్టుకున్నాడు. అయితే మన టాలీవుడ్ హీరోలు శంభాజీ తండ్రి శివాజీ మహరాజ్ గెటప్‌లో ఎలా ఉంటారో చూడండి.


ఛత్రపతి శివాజీలా మన టాలీవుడ్ హీరోలు ఎలా ఉంటారో కొందరు అభిమానులకు చూడాలనిపించింది. అందుకే ఏఐ మాయతో మన హీరోలను సోషల్ మీడియాలో పెట్టారు. ఒక్కసారి ఆ ఫోటోలు చూడండి.
చాలా యేండ్ల క్రితమే చావా సినిమా స్క్రిప్ట్ మన టాలీవుడ్ హీరో మహేష్ బాబు దగ్గరకు వచ్చిందట. ఆయన రిజెక్ట్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ విక్కీ కౌశల్ దగ్గరకు వెళ్లింది. అసలు సూపర్ స్టార్ కృష్ణ గారికి ఛత్రపతి శివాజీ గారంటే ఎంతో ఇష్టం. ఆయన పై సినిమా తీయాలని అనుకున్నారట. కానీ అది కుదరకపోవడంతో చంద్రహాస్, నంబర్ 1 సినిమాల్లో కాసేపు కనిపించారు. ఇలా శివాజీ పాత్రనే కాదు.. ఇతర ఇతిహాసాల కథల్లోనైనా మన హీరోలు చేస్తే చూడాలని చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ కల తీరేదెన్నటికో?!