బంగీ జంపింగ్.. ఒక సాహస క్రీడ. గౌతమ్ అదానీ పంచుకున్న ఈ వీడియోలో.. తన కంపెనీలో వీల్‌చైర్‌లో ఉండే ఉద్యోగి బంగీ జంపింగ్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది. స్ఫూర్తిదాయకమైన ఈ వీడియోని వెనుక కథ మీకోసం..
“చాలా మంది థ్రిల్ కోసం దీన్ని చేస్తారు. మన సొంత అదానియన్ కే మెహతా ఒక ప్రకటన చేయడానికి అలా చేశారు. రిషికేశ్ ఎత్తుల నుంచి తన వీల్‌చైర్‌లో కూర్చొని అంత ఎత్తు నుంచి బంగీ జంప్ చేశాడు. ప్రపంచానికి తన ధైర్యం ఏంటో చూపించాడు. ఎటువంటి భయం అయినా సంకల్ప శక్తిని ఆపలేవు” అని వ్యాపార దిగ్గజం అదానీ తన సోషల్ మీడియా పోస్ట్‌లో రాశాడు.
“కే నువ్వు మమ్మల్ని ప్రేరేపించడమే కాదు – అదానియన్‌గా ఉండడ అంటే ఏమిటో నువ్వు ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చావు. హమ్ కర్కే దిఖాతే హై #HKKDH” అని కూడా ఈ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

ఈ వీడియోలో మెహతా వీల్‌చైర్‌లో.. తన చుట్టూ భద్రతా పట్టీలతో కనిపించాడు. ప్రారంభంలో కొంతమంది వ్యక్తులు అతని చుట్టూ చేరి కెమెరా వైపు చూడమని అడుగుతూ అతనికి శుభాకాంక్షలు తెలిపారు. అతను ఆ సాహస క్రీడను ఆస్వాదిస్తున్నట్లు వీడియో ముగుస్తుంది. ఈ వీడియోని ఇప్పటికే 304K మంది చూశారు. షేర్లు, కామెంట్లు ఇంకా పడుతూనే ఉన్నాయి.
సోషల్ మీడియాలో..
అదానీ వీడియో ప్రజలను ఆశ్చర్యపరిచింది. ఒక వ్యక్తి ఈ వీడియోకి.. “మనస్సు ఇది అసాధ్యమని చెప్పిన ప్రతిసారీ, కాస్మోస్ ఇది ఎంత సులభంగా సాధ్యమో ప్రదర్శించడానికి ఒకరిని పంపుతుంది. స్ఫూర్తిదాయకం!” అంటూ ఒకరు, “కే మెహతా చేసిన నిర్భయమైన, ధైర్యవంతమైన ప్రదర్శన చూడడం ఆనందంగా ఉంది” అని మరొకరు అన్నారు.
మరొక వ్యక్తి “కే మెహతా ధైర్యం నిజంగా అసాధారణమైనది! అతని ముందంజ కేవలం సాహసం గురించి కాదు – దృఢ సంకల్పానికి హద్దులు లేవని అది ఒక శక్తివంతమైన సందేశంషం, “మరోసారి అదానీ గ్రూప్ ఈ భారీ కంపెనీలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే సూచించే ఉద్యోగులకు మద్దతు ఇస్తోంది. మీరు మీ దగ్గర పనిచేసే వ్యక్తులను ఇలా గౌరవించడం, అది నిజంగా మీ గొప్పతనం. మీ మీద మరింత గౌరవం పెరుగుతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
తన కుమారుడు జీత్ అదానీ వివాహ సమయంలో.. గౌతమ్ అదానీ సామాజిక కార్యక్రమాలకు ₹10,000 కోట్లు విరాళంగా ఇచ్చారు. నూతన వధూవరులు జీత్ అదానీ, దివా షా కూడా దివ్యాంగ మహిళల వివాహాలకు ప్రతీ సంవత్సరం ₹10 లక్షలు విరాళంగా ఇస్తామని ప్రతిజ్ఞ చేశారు.