ఎండకాలంలో ఎంతో చ‌లువ చేసే ఉల‌వ చారు!

కావాల్సిన ప‌దార్థాలు:
ఉల‌వ‌లు : రెండు గ్లాసులు
చింత‌పండు :పెద్ద నిమ్మ‌కాయంత
ఉల్లిపాయలు : 2
ప‌సుపు : అర టీస్పూన్
కారం : ఒక టీస్పూన్
జీల‌క‌ర్ర మెంతుల పొడి : అర టీస్పూన్
కొత్తిమీర : ఒక క‌ట్ట‌
జీల‌క‌ర్ర: ఒక టీస్పూన్
ఆవాలు: ఒక టీస్పూన్
ఎండుమిర్చి: 4
క‌రివేపాకు : 2 రెమ్మ‌లు
నూనె, ఉప్పు : స‌రిప‌డినంత‌

త‌యారీ విధానం:
స్టెప్ 1:
ముందుగా ఉలవ‌ల‌ను రాళ్ళు లేకుండా చూసుకొని ఒక గిన్నెలో వేసి రెండు సార్లు క‌డ‌గాలి. త‌ర్వాత ఒక గ్లాసు ఉల‌వ‌ల‌కి నాలుగు గ్లాసుల నీళ్లు పోసుకొని రాత్రంత నానబెట్టుకొవాలి.
స్టెప్ 2: ఉద‌యం చింత‌పండు నాన‌బెట్టుకోవాలి. ఉల్లిపాయ‌ల‌ను క‌ట్ చేసుకోవాలి.
స్టెప్3: ఇప్పుడు ఉల‌వ‌ల‌ను నాన‌బెట్టిన నీళ్ల‌తో పాటు కుక్క‌ర్‌లో వేసి 15 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించుకోవాలి.
స్టెప్ 4: ఉడికించుకున్న ఉల‌వ‌ల‌ను మెత్త‌గా చేసుకోవాలి. చింత‌పండు ర‌సం తీసుకోవాలి.
స్టెప్ 5: ఇప్పుడు మెత్త‌గా చేసుకున్న ఉల‌వ‌లు, చింత‌పండు ర‌సం ఒక గిన్నెలో పోసుకొని ప‌సుపు, కారం, ఉప్పు, జీల‌క‌ర్ర మెంతుల పొడి వేసుకొని స్టౌపై పెట్టి మ‌రిగించుకోవాలి.
స్టెప్ 6 : ఇప్పుడు చారు తాలింపు కోసం స్టౌపై మ‌రొక గిన్నెపెట్టుకొని స్పూన్ల నూనె పోసుకొని నూనె వేడి అయ్యాక జీల‌క‌ర్ర‌, ఆవాలు, వెల్లులి, ఎండు మిర్చి, క‌రివేపాకు వేసి రెండు నిమిషాల పాటు బాగా వేయించుకొని మ‌రుగుతున్న ఉల‌వ‌చారులో వేపి మ‌రో ఐదు నిమిషాల పాటు మ‌రిగించుకోవాలి.
స్టెప్ 7: చివ‌రిగా కొత్తిమీర వేసి దించేయాలి. క‌మ్మ‌టి చ‌లువ చేసే ఉల‌వ‌చారు రెడీ అయిన‌ట్లే!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress