త‌క్కువ ప‌దార్థాల‌తో.. త‌క్కువ స‌మ‌యంలో చేసుకొనే స్వీట్‌.. బొంబాయి క‌రాచి హ‌ల్వా!

కావాల్సిన ప‌దార్థాలు :
కార్న్ ఫ్లోర్: అర క‌ప్పు
చ‌క్కెర : ఒక క‌ప్పు
బాదం, పిస్తా, జీడి ప‌ప్పు: అర క‌ప్పు
నెయ్యి : అర క‌ప్పు
ఫుడ్ క‌ల‌ర్ : అర టీ స్పూన్
యాల‌కుల పొడి: ఒక టీ స్పూన్

త‌యారీ విధానం:
స్టెప్1:
కార్న్‌ఫ్లోర్‌ని ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు పొసి జారుగా క‌లిపి పెట్టుకోవాలి. బాదం, పిస్తా, జీడిపప్పు ప‌లుకులుగా క‌ట్ చేసి పెట్టుకోవాలి.
స్టెప్2: స్టౌపై ఒక క‌డాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి వేడి అయిన త‌ర్వాత క‌ట్ చేసుకున్న బాదం , పిస్తా, జీడిప‌ప్పు వేసి వేయించి ప‌క్క‌న పెట్టుకోవాలి.
స్టెప్3: అదే క‌డాయిలొ ఇంకో స్పూన్ నెయ్యి వేసి చ‌క్కెర ఒక క‌ప్పు నీళ్లు పోసి మ‌రిగించుకోవాలి. ఇప్పుడు అందులో యాల‌కుల పొడి ముందుగా క‌లిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్ర‌మంను వేసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి.
స్టెప్4: ఇప్పుడు మిగిలిన నెయ్యి, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి క‌లుపుకోవాలి. ఫుడ్ క‌ల‌ర్‌లో కొన్నినీళ్లు క‌లిపి అందులో వేసి ఒక‌సారి క‌లిపి రెండు నిమిషాల త‌ర్వాత దించేయాలి.
స్టెప్5: ఒక కేక్ మౌల్ట్ లేదా ప్లేట్‌ తీసుకొని కొద్దిగా చ‌ల్లారిన మిశ్ర‌మంను వేసుకోవాలి. ఇది పూర్తిగా చ‌ల్లారిన త‌ర్వాత డీమౌల్డ్ చేసి మ‌న‌కు న‌చ్చిన ఆకారంలో క‌ట్ చేసుకుంటే స‌రిపోతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress