ఇంట్లో ఈజీగా చేసే క‌ర‌క‌ర‌లాడే కోన్‌ చాట్!

కావాల్సిన ప‌దార్థాలు :
మైదా : ఒక‌ క‌ప్పు
ర‌వ్వ‌: 4 టీస్పూన్స్
వాము : ఒక టీస్పూన్స్
ఉల్లిగ‌డ్డ : ఒక‌టి
ట‌మాట : ఒక‌టి
ఆలుగ‌డ్డ‌: ఒక‌టి
శ‌న‌గ‌లు: ఒక‌ క‌ప్పు
కొత్తిమీర‌: ఒక‌ క‌ట్ట‌
నిమ్మ‌కాయ‌: స‌గం
ధ‌నియాల పొడి : ఒక‌ టీస్పూన్
చాట్ మాసాలా : అర‌ టీస్పూన్
సెవ్ : అర క‌ప్పు
పెరుగు : అర క‌ప్పు
ఐస్ క్రీం మౌల్డ్స్ : 2
నూనె, ఉప్పు : స‌రిప‌డినంత‌

త‌యారీ విధానం:
స్టెప్1:
మైదా, ర‌వ్వ‌, వాము, ఉప్పు, ఒక టీస్పూన్ నూనె వేసి చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి. పిండిని ఒక ఐదు నిమిషాలు నాన‌నివ్వాలి.
స్టెప్ 2: ఆలుగ‌డ్డ‌ని ఉడికించి చిన్న ముక్క‌లుగా క‌ట్ చేయాలి. శ‌న‌గ‌ల‌ను ఉడికించి పెట్టుకోవాలి. ఉల్లిగ‌డ్డ‌, ట‌మాట‌ని చిన్న‌గా క‌ట్ చేసి పెట్టుకోవాలి.
స్టెప్3: పిండిని చపాతీలా చేసుకొని స‌గంకి క‌ట్ చేసి ఐస్క్రీం మౌల్డ్స్ పై వేసి కోన్ షేప్ వ‌చ్చేలా చేసుకొని పెట్టుకోవాలి. ఒక క‌డాయిలో డీప్ ఫ్రైకి స‌రిప‌డా నూనె పోసుకొని నూనె వేడి అయిన త‌ర్వాత ఇంత‌కుముందు చేసి పెట్టుకున్న కోన్లు వేసి గోల్డ్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించి ప‌క్క‌న పెట్టుకొవాలి.
స్టెప్ 4: ఒక గిన్నెలో క‌ట్ చేసుక‌న్న ట‌మాట‌, ఉల్లిపాయ, ఆలుగడ్డ‌, శ‌న‌గ‌లు, కొత్తిమీర‌, ధ‌నియాల పొడి, చాట్ మ‌సాలా, ఉప్పు, నిమ్మ‌ ర‌సం వేసి బాగా క‌లుపాలి.
స్టెప్ 5: ఇప్పుడు ఫ్రై చేసుకున్న కోన్ల‌లో ఇందాక క‌లిపి పెట్ట‌కున్న మిశ్ర‌మం పెట్టి పైన పెరుగు, సెవ్ వేసి స‌ర్వ్ చేసుకోవాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress