చేదులేకుండా నిల్వ ఉండే కాక‌ర‌కాయ‌ ఉల్లి కారం!

కావాల్సిన ప‌దార్థాలు :

కాక‌రకాయ‌లు : 500 గ్రా.
ఉల్లిపాయ‌లు: 2 పెద్ద‌వి
జీల‌క‌ర్ర : ఒక‌ టీ స్పూన్
చింత‌పండు : నిమ్మ‌కాయ అంత‌
వెల్లులి రెబ్బ‌లు : 10
మిన‌ప ప‌ప్పు : ఒక‌ టీస్పూన్
శ‌న‌గ ప‌ప్పు: ఒక‌ టీస్పూన్
ధ‌నియాలు: ఒక‌ టీస్పూన్
కారం : ఒక‌ టీస్పూన్
నూనె, ఉప్పు : స‌రిప‌డినంత‌

త‌యారీ విధానం :

స్టెప్ 1: కాక‌ర కాయలు శుభ్రంగా క‌డిగి ఒక ఇంచు సైజులో క‌ట్ చేసి మ‌ద్య‌లో ఉన్న గింజ‌లు తీసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ‌లు క‌ట్ చేసుకోవాలి.

స్టెప్ 2: స్టౌ పై ఒక క‌డాయి పెట్టుకొని నూనె వేసుకొని క‌ట్ చేసుకున్న ఉల్లిపాయ‌లు, జీల‌క‌ర్ర, వెల్లులి వేసి వేయించుకొని ప‌క్క‌కు పెట్టుకోవాలి. అదే క‌డాయిలో శ‌న‌గ ప‌ప్పు, మిన‌ప ప‌ప్పు, ధ‌నియాలు కూడా వేయించుకోవాలి. కాక‌ర కాయ‌లు కూడా ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించుకోవాలి.

స్టెప్ 3: వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ‌ల మిశ్రమం శ‌న‌గ ప‌ప్పు, మిన‌ప ప‌ప్పు, ధ‌నియాలు , చింత‌పండు, కారం,ఉప్పు కొన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి.

స్టెప్ 4: ఇప్పుడు వేయించి పెట్టుకున్న కాకర కాయ‌ల లోప‌ల మిక్సీ ప‌ట్టుకున్న మిశ్ర‌మంను పెట్టుకొని ఉంచాలి.

స్టెప్ 5: ఇంకో క‌డాయిలో నూనె పోసుకొని కాక‌ర కాయ‌లు వేసి మిగిలిన మిశ్ర‌మం కూడా వేపి క‌లిపి స‌న్నని మంట మీద ఐదు నిమిషాలు పాటు ఉంచుకోవాలి. అంతే నోరురించే కాక‌ర కాయ ఉల్లి కారం రెడీ!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress