టిక్‌టాక్ యూజర్ సచి రాజ్‌గురూ ఒక బట్టల దుకాణానికి వెళ్లింది. అక్కడ బాస్మతీ బియ్యం సంచితో తయారు చేసిన పొడవాటి జాకెట్‌ను ధరించింది. ఆ జాకెట్ ధర ఇంటర్నెట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది!
ఎప్పుడు ఏది ట్రెండింగ్ అవుతుందో ఎవరికీ అర్థం కాదు. అలాగే ఈ రాయల్ బాస్మతీ బియ్యం సంచికి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక ట్రెండ్ నడుస్తుంది. అమెరికాలో దొరికే ఈ బాస్మతీ రైస్ బ్యాగ్‌ని ఒకావిడ హ్యాండ్‌బ్యాగ్‌ల ధరించి ఆ మధ్య హల్చల్ చేసింది. ఇప్పుడు అదే బ్రాండ్‌తో చేసిన కోట్ ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది. దాని కథాకమామీషు గురించే ఈ ప్రత్యేక కథనం..

సచి టిక్‌టాక్ వీడియో ప్రకారం.. బాస్మతీ బియ్యం సంచి కోటు విలువ $1,950 (₹1.66 లక్షలు). ఈ క్లిప్ ఆమె ఒక బోటిక్‌లో ఒక వింతైన ఫ్యాషన్‌ను కనుగొన్నట్లు చూపించింది. పూర్తిగా రాయల్ బాస్మతి బియ్యం సంచితో తయారు చేసిన పొడవాటి కోటు అది. ఈ పొడవైన కోటుపై ఆసక్తికరమైన లాపెల్ లేబుల్ కూడా ఉంది. మామూలుగా బియ్యం సంచి ఖాళీ భారతీయ ఇళ్లలో డోర్‌మ్యాట్ లేదా కిరాణా సంచిగా తిరిగి ఉపయోగిస్తారు. కానీ అమెరికాలో మాత్రమే దీనిని వింతగా వాడుతున్నారు. అయితే ఈ కోటు మీద సోషల్ మీడియా కాస్త వింతగా స్పందించింది.
https://www.tiktok.com/@sachirajguroo/video/7508232618760998175
ఈ వింతైన ఫ్యాషన్, ధర ట్యాగ్ చూసి దేశీ నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఒక వినియోగదారు.. “మొదట మా దుపట్టా స్కాండినేవియన్ స్కార్ఫ్, ఇప్పుడు ఇది!! పనీర్‌ను నార్డిక్ టోఫుగా బ్రాండ్ చేయడానికి వేచి ఉంది!” అని, మరొకరు “ప్రపంచం పిచ్చిగా మారింది” అంటూ ఇలా స్పందించారు. ఒక ఇన్స్టాగ్రామ్ వినియోగదారు.. “ఆ ధరకు నా మొత్తం భవనాన్ని పోషించడానికి తగినంత బియ్యం కొనడానికి నేను ఇష్టపడతాను” , మరొక ఇన్స్టాగ్రామ్ పేజీలో “అమెరికన్లు నిజంగా ఏదైనా కొంటారని నిరూపిస్తోంది” అంటూ రాసుకొచ్చారు. నిజంగా ఈ పోకడ చూస్తుంటే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.